Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాను కోరిన ఐరాస చీఫ్
న్యూయార్క్ : ఇరాన్‌పై ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అమెరికాను కోరారు. అణ్వాయుధాలను తయారు చేయకుండా ఇరాన్‌ను నిలువరించేందుకు 2015లో కుదిరిన ఒప్పందాన్ని తీసుకోవాలని కోరారు. ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి సంబంధించి అన్ని ఆంక్షలను మాఫీ చేయాలని కోరారు. ఇరాన్‌తో అణు నిరాయుధీకరణ ఒప్పందంలో భాగస్వామిగా ఉన్నది అమెరికా మాత్రమే కాదు. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, రష్యా, చైనా కూడా దీనిపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం అమలుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ద్వైవార్షిక నివేదికపై భద్రతా మండలి చర్చించనుంది. అణు ఒప్పందంగా ప్రాచుర్యం పొందిన 'సమగ్ర ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక' ను పునరుద్ధరించేందుకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో గుటెరస్ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం. 2018లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలిగారు. ఆ వెంటనే ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలుకు కట్టుబడాలని ఇరాన్‌కు కూడా గుటెరస్ విజ్ఞప్తి చేశారు. అమెరికా గనుక ఆంక్షలు ఎత్తివేస్తే తాము వెంటనే యురేనియం శుద్ధిని నిలిపివేస్తామని ఇరాన్ చెబుతున్న సంగతి తెలిసిందే.