Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా, కెనడాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ విధంగా జరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ అమెరికా రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనవసరంగా బయటకు రావద్దంటూ ప్రజల్ని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కెనడాలోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కెనడాలోని వాంకువెర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలతో ఈ ప్రాంతంలో శుక్రవారం నుంచి 134 మంది మరణించినట్లు చెప్పారు. బ్రిటిష్ కొలంబియా, అల్బెర్టా, సస్కాత్చెవాన్, మానిటోబా, యుకెన్ వంటి రాష్ట్ట్రాలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.