Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలోని సంస్థ డైరెక్టర్‌కు వ్యతిరేకంగా ఓటు
- వాటాదారులకు గ్లాస్ లెవీస్ సూచన
మెల్బోర్న్ : ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యాటనలో దగ్గరుండి గౌతం అదానీకి ఇప్పించిన బొగ్గు గని ప్రాజెక్టు అభాసు పాలవుతూనే ఉన్నది. ఆస్ట్రేలియా ప్రాజెక్టు అంశంలో అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని వాటాదారులకు గ్లోబల్ గవర్నెన్స్ సలహా సంస్థ గ్లాస్ లెవీస్ సూచించింది. ఈ సంస్థ కంపెనీ వార్షిక సాధారణ సమావేశాల సందర్బంగా వాటాదారులకు పలు సూచనలు చేస్తుంది. జులై 12న అదానీ ఎంటర్ప్రైజెస్ రిస్కు కమిటీ వార్షిక జనరల్ బాడీ సమావేశం జరగనున్నది. దీనికి గౌతం అదానీ సోదరుడి కుమారుడు ప్రనవ్ అదానీ నమినీగా ఉన్నారు. పరోక్షంగా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని గ్లాస్ లెవీస్ సూచించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఆస్ట్రేలియన్ యూనిట్ 'బ్రవుస్ మైనింగ్ అండ్ రీసోర్సేస్' నౌకాశ్రయ వ్యాపారం నీతిలేని నిర్వాహకముగా ఉన్నదని అదానీ కార్మిచెల్ మైనింగ్, నౌకాశ్రయంపై ఆస్ట్రేలియా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గ్లాస్ లెవీస్ ఈ ప్రకటన చేసింది. భారత్‌కు బొగ్గు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందని తెలిపింది. ఈ రంగంలో ఏకస్వామ్య వ్యాపారానికి కారణం కానుందని హెచ్చరించింది.