Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో:చైనా కమ్యూనిస్టు పార్టీ విజయవంతంగా 100 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియచేస్తూ శ్రీలంక ప్రభుత్వం రెండు నాణాలను విడుదల చేసింది. ఇరుదేశాల మధ్య 65 సంవత్సరాల స్నేహానికి గుర్తింపుగా ఈ నాణాలను విడుదల చేసినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి బంగారు నాణెం రెండోది వెండి నాణెం. ఒక నాణెంపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అని సింగళ, తమిళ, ఇంగ్లీషు భాషలో ముద్రించి ఉన్నది. దానిపై 1921-2021 అని 100 సంవత్సరాలు అని రాసారు. రెండో నాణెంపై కొలంబోలో చైనా నిర్మించిన నీలుం పోకునా మహింద్ర, రాజపక్సా థియేటర్ చిత్రం ఉన్నది. దానితో పాటు శ్రీలంక, చైనా జాతీయ జెండాలు ఉంటాయి. శ్రీలంక చైనా 65 సంవత్సరాలు అనే పదాలతో పాటు 2022 సంవత్సరం అని ముద్రించారు. చైనా తమకు ఆప్తమిత్రుడనీ, ఇన్ని సంవత్సరాల్లో స్నేహం అంటే ఎలా ఉండాలో ఆ దేశం గొప్ప సందేశం ఇచ్చిందని శ్రీలంక ప్రభుత్వం పేర్కొన్నది.
.