- బ్రిటన్ ఆస్పత్రుల్లో సైన్యం సేవలు లండన్ : ఒమిక్రాన్ విజృంభించడంతో బ్రిటన్‌లో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా వుంది. ఆస్పత్రుల్లో రోగుల అవసరాలు చూసుకునే సిబ్బందికి కొరత ఏర్పడడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. రాబోయే మూడు వారాల కోసం ఆస్పత్రుల్లో పనిచేసేందుకు దాదాపు 200మంది సైనికులను మోహరించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.