వెనిజులా : వెనిజులాలోని భారీనాస్ రాష్ట్ర గవర్నర్ ఎన్నికలు వచ్చే ఆదివారం జరగాల్సిన ఉన్నది. ఆ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్ష ఉగ్రవాదులు తమ ప్రయత్నాలను చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరాను దిగ్బంధనం చేశారు. ఎన్నికలను జరగకుండా చేసి అక్కడి వామ పక్ష ప్రభుత్వాన్ని బదనాం చేయడమే వారి లక్ష్యంగా కనబడుతున్నదని విశ్లేషకులు ఆరోపించారు. అయితే, అక్కడి ప్రభుత్వ రంగంలోని జాతీయ విద్యుత్ కార్పొరేషన్ కార్మికులు రాత్రి, పగలు కష్టపడి పనిచేసి వంద శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇక ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. వెనిజులా లోని వామపక్ష ప్రభుత్వంను ఇరకాటంలో పెట్టేందుకు ఈ విద్యుత్ దిగ్బంధం. గతంలోనూ దేశాధ్యక్షుడు, ఇరవై మూడు రాష్ట్రాలకు 2019 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పుడూ విద్యుత్ దిగ్బంధనం చేశారు. 11 రోజుల పాటు దేశం మొత్తం విద్యుత్ సరఫరా లేకుండానే గడపాల్సి వచ్చింది. అప్పుడు కూడా జాతీయ విద్యుత్ కార్పొరేషన్ పూనుకుని విద్యుత్ సరఫరా పునరుద్ధరించింది. ఎన్నికలు సకాలంలో జరిగేలా చూసుకున్నది. ప్రస్తుతం ఈ విద్యుత్ దిగ్బంధనం లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు అన్ని వైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి.