కజకిస్తాన్ సమస్య పరిష్కారానికి రష్యా, చైనాలు సహకారం
Fri 14 Jan 06:34:52.433727 2022
బీజింగ్: కజకిస్తాన్ సమస్య పరిష్కరించేందుకుగాను రష్యా, చైనా సహకారం అందించేందుకు ముందుకొచ్చాయి. కజకిస్తాన్ మధ్య ఆసియాలో పుష్కలంగా పెట్రోలియం కలిగిన దేశం. కజకిస్తాన్‌కు 14 దేశాలతో సరిహద్దు ఉన్నది. ఒక్క చైనాతోనే 14 వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. కజకిస్తాన్‌లో శాంతి ఉంటేనే ఆ దేశం అభివృద్ధి అవుతుంది, అందుకని ఇతర దేశాల సహకారంతో శాంతి కాపాడుకునే ప్రయత్నంలో ఆ ప్రభుత్వం ఉన్నది. చైనా సహకారానికి సంక్షోభం యుద్ధ నివారణ అనే లక్ష్యంతో కీలకంగా ఉండింది. ఇతర దేశాలు సహకారం అందిస్తే యుద్ధాన్ని పెంచి అస్థిరతను కొనసాగేలా చేసే లక్షణం కలిగి ఉంటాయి. వారి స్వార్థం అది. రష్యా చైనాలు ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అందుకని కజకస్తాన్ వ్యవహారంలో చొరవ తీసుకుని అక్కడ ఉగ్రవాదం తీవ్రవాదం వేర్పాటు వాదం లాంటి మూడు సమస్యలను తీవ్రం కాకుండా చూసుకోవడం వారు తమ బాధ్యతగా భావించారు. సామ్రాజ్యవాద దేశాలు యుద్ధవాతావరణం కలిగిన ప్రాంతాలలో దేశాలను ఒంటరిగా చేసి వారికి సహకారం పేరుతో అగ్నికి ఆజ్యం పోస్తూ యుద్ధాన్ని కొనసాగించాలని లక్ష్యంతో పని చేస్తుంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా సోషలిస్టు చైనా సంక్షోభం, యుద్ధం రాకుండా చర్యలు తీసుకుంటున్నది.