Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
  • గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం
  • టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌
  • సీజ్‌ చేసిన వాహనాల వేలం
  • సీజ్‌ చేసిన వాహనాల వేలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రజల మేలు కోసం పనిచేసే శక్తి క్వాడ్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

ప్రజల మేలు కోసం పనిచేసే శక్తి క్వాడ్‌

Wed 25 May 01:22:36.237543 2022

- టోక్యో సదస్సులో ప్రధాని మోడీ
- ఇండో-పసిఫిక్‌ ప్రాంత శాంతి సుస్థిరతలకు దోహదపడుతుందని వ్యాఖ్య
- భారత్‌, అమెరికా భాగస్వామ్యం ప్రత్యేకం : బైడెన్‌
టోక్యో : క్వాడ్‌ సభ్య దేశాల మధ్య పరస్పర విశ్వాసం, కృత నిశ్చయం ప్రజాస్వామ్య శక్తులకు నూతన ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయనీ, అందరినీ కలుపుకుని పోగల, స్వేచ్ఛా, బహిరంగ ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని ప్రోత్సహిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. క్వాడ్‌ దేశాల రెండో సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి నిర్మాణాత్మక ఎజెండాతో క్వాడ్‌ ముందుకు సాగుతోందని చెప్పారు. ''ప్రజల మేలు కోసం పనిచేసే శక్తి'' గా క్వాడ్‌ తన పేరును మరింత బలోపేతం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. సదస్సులో ప్రారంభోపన్యానం చేస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ వేదికపై క్వాడ్‌ మంచి పేరును, స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ, వాతావరణ కార్యాచరణ, సరఫరా మార్గాలు, కోవిడ్‌ మహమ్మారి వల్ల తలెత్తిన పరిస్థితులతో సహా ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడం, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో సమన్వయాన్ని పంచుకున్నామని చెప్పారు. వివిధ రంగాల్లో క్వాడ్‌ దేశాల మధ్య సహకారం ఇండో-పసిఫిక్‌ ప్రాంత శాంతి, సుస్థిరతలకు దోహదపడుతుందని అన్నారు. గత కొన్నేండ్లుగా చైనాతో క్వాడ్‌ సభ్య దేశాల సంబంధాలు ఉద్రిక్తంగా వున్న సమయంలో ఈ సదస్సు జరుగుతున్నది. ఇండో-పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధి కోసం దీర్ఘకాల దార్శనికతతో ఐపీఈఎఫ్‌ (ఇండో-పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ప్రాస్పరిటీ)ను బైడెన్‌ సోమవారం ప్రారంభించారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని తయారుచేసేందుకు సమిష్టి ఆకాంక్షను ప్రతిబింబించడమే ఈ ఐపీఈఎఫ్‌ ఏర్పాటని మోడీ ప్రకటించారు. ఈ ప్రాంత ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనడానికి ఉమ్మడి, సృజనాత్మక పరిష్కారాల కోసం మోడీ పిలుపిచ్చారు. మన పిల్లలకు మరిన్ని అవకాశాలు సృష్టించగల, మరింత సంక్షేమాన్ని, సౌభాగ్యాన్ని తీసుకురాగల స్వేచ్ఛా, పారదర్శక ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని ఏర్పాటుచేయాలన్న లక్ష్యాన్ని మనందరం పంచుకుంటున్నామని బైడెన్‌ తన తొలి పలుకుల్లో పేర్కొన్నారు. ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ అందరితో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు.
             ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు, సహకారానికి, వ్యూహాత్మక మార్గనిర్దేశనానికి కొత్తరంగాలకు గుర్తించేందుకు నేతలకు ఇదొక మంచి అవకాశమని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చి ట్వీట్‌ చేశారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళిలో పేర్కొన్న నిబంధలను రష్యా యుద్ధం సవాలు చేసిందని జపాన్‌ ప్రధాని కిషిదా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీతో బైడెన్‌ ద్వైపాక్షిక సమావేశం
             భారత్‌తో అమెరికా భాగస్వామ్యం మరే ఇతర దేశంతో లేనంత ప్రత్యేకంగా వుండేలా చర్యలు తీసుకోవడానికి కట్టుబడి వున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం ప్రధాని మోడీకి తెలియచేశారు. క్వాడ్‌ నేతల రెండో సదస్సు కోసం ప్రస్తుతం వీరిరువురు టోక్యోలో వున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో బైడెన్‌ ద్వైపాక్షిక సమావేశం జరిపారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై భారత్‌ చేసిన కృషిని ప్రశంసించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పరిశుద్ధ ఇంధన చొరవలకు మద్దతుగా భారత్‌లో కీలకమైన పనులు కొనసాగించడానికి ఇరు దేశాలు ఒప్పందానికి రావడం పట్ల సంతోషంగా వున్నట్టు బైడెన్‌ తెలిపారు. భారత్‌-అమెరికా వ్యాక్సినేషన్‌ కార్యాచరణ క్రమాన్ని పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. రెండు దేశాలు కలిసి చేయాల్సింది చాలా వుందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం కారణంగా తలెత్తిన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ఇరు దేశాలు కలిసి కృషి చేయనున్నట్టు తెలిపారు.
ఆస్ట్రేలియా నూతన ప్రధానితో మోడీ భేటీ
             ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ప్రధాని మోడీ మంగళవారం చర్చలు జరిపారు. ఇరు దేశాల ధ్రుడమైన ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల్లో కీలక రంగాల వ్యాప్తంగా అభివృద్ధి మరింత ఊపు అందుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. క్వాడ్‌ సదస్సు నేపథ్యంలో వీరు సమావేశమయ్యారు. సోమవారమే ఆంథోనీ అల్బనీస్‌ ఆస్ట్రేలియా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్ట్రేలియాతో భారత్‌కు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం వుంది. ఈ సంబంధాల వల్ల ఇరు దేశాల ప్రజలకే కాదు, మొత్తంగా ప్రపంచ దేశాలు లాభపడతాయని మోడీ ట్వీట్‌ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా సమీక్షించామనీ, కీలక రంగాల్లో మరింత అభివృద్ధిని పెంచేందుకు గల మార్గాలపై కూడా చర్చించామని మోడీ ట్వీట్‌ ద్వారా తెలిపారు. మోడీతో జరిగిన సమావేశం పట్ల అల్బనీస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుద్ధ ఇంధన సాంకేతికతతో సహా పూర్తి స్థాయి వ్యూహాత్మక, ఆర్థిక ఎజెండాపై మోడీతో చర్చించినట్టు తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు ఇంత సన్నిహితంగా ఎన్నడూ లేవని వ్యాఖ్యానించారు. టోక్యోలో ఇరువురు నేతలు అర్ధవంతమైన చర్చలు జరిపారని అంతకుముందు ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. వైవిధ్యభరితమైన రంగాల్లో అభివృద్ధి సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడంపై చర్చల్లో దృష్టి కేంద్రీకరించినట్టు ఆ ట్వీట్‌ పేర్కొంది. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అల్బనీస్‌కు మోడీ అభినందనలు తెలియచేశారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద బహుళపక్ష సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తయారీ రంగం, పునర్వినియోగ ఇంధనం, విద్య, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయ పరిశోధన, క్రీడలు, ప్రజల మధ్య సంబంధాలు రంగాల్లో సహకారం పూర్తి స్థాయిలో వుండేందుకు అంగీకరించారని తెలిపంది. ద్వైపాక్షిక సంబంధాల్లోని సానుకూల ఊపును కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. త్వరలో భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రధానిని మోడీ ఆహ్వానించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం
పశ్చిమ దేశాల ఆయుధాల డిపోను ధ్వంసం చేశాం : రష్యా
ముందే హెచ్చరించాం... జెలెన్‌స్కీ వినలేదు
ఏజియన్‌ దీవుల సైనికీకరణ ఆపండి
పసిఫిక్‌ ద్వీప దేశాలతో సహకారానికి సిద్ధంగా వున్నాం : చైనా వెల్లడి
చాద్‌లో ఆహార అత్యవసర పరిస్థితి !
నైజీరియాలో నరమేధం
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
మీరు తప్పులు చేసి మమ్మల్ని నిందిస్తారా?
అధిక ధరల నుంచి ఊరట కోసం కనీస వేతనాల పెంపు!
భారత్‌లో మత స్వేచ్ఛకు ముప్పు
కతార్‌ మాజీ యువరాణి అనుమానాస్పద మృతి
బహ్రెయిన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.