Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
  • వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్
  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మృత్యుకంపం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

మృత్యుకంపం

Thu 23 Jun 03:03:08.852944 2022

- ఆఫ్ఘన్‌లో పెను విషాదం
- వెయ్యి మందికి పైగా మృతి.. మరింత పెరిగే అవకాశం
- భూకంపంతో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం
- రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదు
- దాదాపు 1500 మందికి గాయాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
                ఆఫ్ఘనిస్థాన్‌ భూకంపంతో వణికింది. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరిత్యం ఆ దేశంలోని తూర్పు ప్రావిన్సులైన పక్తికా, ఖోస్ట్‌ లలో తీవ్ర ఆస్థి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. దీంతో వందలాది మంది ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. భూకంపం ధాటికి ఇనేక ఇండ్లు నేలమట్టమయ్యాయి. శిధిలాల్లో వందలాది సంఖ్యలో మృతులు, క్షతగాత్రులు చిక్కుకుపోయి ఉన్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మారుమూల కొండ ప్రాంతంలోని భూకంపం సంభవించటంతో సమాచార సేకరణ సంక్లిష్టంగా మారింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని అక్కడి అధికారులు చెప్పారు. అక్కడి తాలిబన్‌ ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించి కొనసాగిస్తున్నది.
కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌పై ప్రకృతి ప్రకోపం చూపించింది. ఆ దేశంలోని తూర్పు ప్రావిన్సులైన పక్తికా, ఖోస్ట్‌లలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదైంది. భూకంపం ధాటికి వెయ్యి మందికి పైగా మరణించారు. దాదాపు 1500 మంది వరకు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదని ఆ దేశ సమాచార సాంస్కృతిక విభాగం అధిపతి మహమ్మద్‌ అమీన్‌ హుజైఫా తెలిపారు.
           భూకంప తీవ్రత పక్తికా ప్రావిన్సులో అధికంగా కనిపించింది. ఈ ప్రావిన్సులోనే అధిక మరణాలు నమోదయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. ఇక్కడ 255 మంది వరకు మృతి చెందగా.. 200 మందికి పైగా గాయాలపాలైనట్టు తాలిబన్‌ ప్రభుత్వంలోని అంతర్‌ మంత్రిత్వ శాఖ అధికారి సలాహుద్దీన్‌ అయూబ్‌ వెల్లడించారు. పక్తికా ప్రావిన్సులోని నాలుగు జిల్లాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నదని అధికారులు తెలిపారు. బర్మల్‌, జిరుక్‌, నాకా, గ్యాన్‌ జిల్లాల్లో శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను బయటకు తీయడానికి భద్రతా దళాల హెలికాప్టర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని ఆఫ్ఘనిస్థాన్‌ స్టేట్‌ న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టర్‌ అబ్దుల్‌ వాహిద్‌ ర్యాన్‌ ట్వీట్‌ చేశారు. నంగర్‌హర్‌ ప్రావిన్సులో 25 మరణాలు నమోదైనట్టు అధికారులు వివరించారు. ''కొన్ని గ్రామాలు మారుమూల పర్వత ప్రాంతాల్లో ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. వారి సమాచార సేకరణకు కొంత సమయం పడుతుంది. అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. క్షతగాత్రులను చేరుకోవటానికి, మెడికల్‌ సప్లరు, ఆహారం చేరవేయడానికి హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి'' అని అయూబ్‌ తెలిపారు.
ఆఫ్ఘన్‌ ప్రధాని అత్యవసరం సమావేశం
           భూకంపం ఇక్కడి ప్రాంతంలో అనేక ఇండ్లను నేలమట్టం చేశాయని తాలిబన్‌ ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి బిలాల్‌ కరీమీ చెప్పారు. విపత్తు తదుపరి తీవ్రతను తగ్గించటం కోసం ప్రభావిత ప్రాంతాలకు బృందాలను పంపాలని సహాయక ఏజెన్సీలను కోరినట్టు వివరించారు. పక్తికా, ఖోస్ట్‌ ప్రాంతాలలో సహాయక చర్యలపై సమన్వయం కోసం ఆఫ్ఘనిస్థాన్‌ ప్రధాని మొహమ్మద్‌ హస్సన్‌ అఖుంద్‌ ఆ దేశ రాజధాని కాబూల్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పాక్‌, భారత్‌లలోనూ ప్రకంపనలు
           ఆఫ్ఘనిస్థాన్‌కు ఆగేయాన ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్టు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఇది భూమి ఉపరితలం నుంచి 51 కిలోమీటర్ల లోతు ఉన్నట్టు వివరించింది. ఆఫ్ఘన్‌కు పొరుగుదేశం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సు, భారత్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తున్నది. అయితే, ఇక్కడ ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టాలు మాత్రం జరగలేదు. ఆఫ్ఘన్‌లో భూకంప మృతుల సంఖ్య పెరిగుతుండటంపై పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
ప్రపంచదేశాల సహకారాన్ని కోరిన ఆఫ్ఘన్‌
           ఆఫ్ఘన్‌ను గతేడాది తాలిబన్‌ తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అనే అంతర్జాతీయ సహాయక ఏజెన్సీలు ఆఫ్ఘనిస్థాన్‌ విడిచి వెళ్లాయి. దీంతో సహాయక చర్యలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తున్నది. కాగా, తమకు అంతర్జాతీయ సమాజం సహకారం కావాలని ఆఫ్ఘనిస్థాన్‌ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను కోరింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సల్మాన్‌ రష్దీకి వెంటిలేటర్‌ తొలగింపు
బ్రిటన్‌ తదుపరి పీఎం లిజ్‌ ట్రూస్‌ ?
ఆస్ట్రేలియా ఎయిర్‌ పోర్టులో కాల్పుల కలకలం
జెరూసలెంలో ముష్కరుల దాడి..
ఈజిప్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం
పని బాగోలేకుంటే వీధిన పడతారు
ఆస్తులు సీజ్‌ చేస్తే అమెరికాతో అన్నీ కట్‌ !
ఆహారం.. పని కావాలి
ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి..
థాయ్‌లాండ్‌లో గొటబాయ రాజపక్సా?
కోవిడ్‌పై మెరుపు విజయాన్ని సాధించాం
వెనక్కి తగ్గిన అమెరికా !
2022లో వృద్థి రేటు తగ్గొచ్చు
నిప్పుతో చెలగాటం వద్దు !
నోబుల్‌ గ్రహీత యూనస్‌పై విచారణ ప్రారంభం
చమురు ధరల్లో పెరుగుదల
మంకీపాక్స్‌కు మశూచి వ్యాక్సిన్‌ !
మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !
బ్రిటన్‌ పోరులో వెనుకబడ్డ రిషి సునాక్‌ !
అధ్యక్ష ఎన్నిక షురూ!
మధ్య ప్రాచ్యం ఎవరి సొత్తూ కాదు !
మంకీ పాక్స్‌ వ్యాక్సిన్‌ దాచేస్తున్నారు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్‌ విక్రమ్‌ సింఘే ప్రమాణం
చిన్నారి సూది మందుకు కరోనా దెబ్బ
శ్రీలంక రణరంగం
సంక్షోభం నుంచి గట్టెక్కిస్తా...
యూరోను దాటేసిన డాలర్‌
ప్లాస్టిక్‌ను తినే చేప !
బ్రిటన్‌ ప్రధాని రేసులో తొమ్మిది మంది
అమెరికాలో 39 రాష్ట్రాలకు విస్తరించిన మంకీపాక్స్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.