Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్ సైన్యం దురాగతం
వెస్ట్‌బ్యాంక్ : పాలస్తీనాలో ఇజ్రాయిల్ సైన్యం దురాగతాలు ఆగడం లేదు. గురువారం 60 ఏళ్ల మహిళసహా తొమ్మిది మంది పాలస్తీనీయుల్ని దారుణంగా హత్య చేసింది. వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది పాలస్తీయులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. గురువారం శరణార్థుల శిబిరంతోపాటు వెస్ట్‌బ్యాంక్‌లోని ఒక ఆసుపత్రిపై ఇజ్రాయిల్ సైన్యం దాడులు జరిపిందని పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించడంతో అనేక మంది రోగులు, బంధువులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయుధులు ఉన్నారనే సమాచారంతోనే ఈ దాడులు చేశామని ఇజ్రాయిల్ సైన్యం తన దారుణాన్ని సమర్థించుకుంది. ఇజ్రాయిల్ సైన్యం దాడుల్లో 2023లో ఒక నెల కూడా పూర్తి కాకముందే ఇప్పటి వరకూ 29 మంది మరణించారు.