Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లూనా-25 షెడ్యూలు ప్రకటించిన రష్యా
మాస్కో : చంద్రుడి మీదకు రష్యా మూన్ ల్యాండర్ లూనా - 25ను పంపనుంది. తాజాగా మ్యూన్ ల్యాండర్‌ను ప్రయోగించే తేదీని రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మస్ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 13వ తేదీన లూనా - 25ను లాంచ్ చేయనున్నట్లు రాస్కాస్మస్ తెలిపింది. అయితే ఈ ప్రయోగం గతేడాది సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల రాస్కాస్మస్ వాయిదా వేసింది. కాగా, 1976 తర్వాత మళ్లీ ఈ ఏడాదే చంద్రుడి మీదకు రష్యా లూనార్ ప్రోబ్‌ను పంపిస్తోంది. ఈసారి ఎన్ని అవాంతరాలు వచ్చినా.. లూనా - 25 ప్రయోగాన్ని సమర్థవంతంగా చేపట్టనున్నట్లు రాస్కాస్మస్ తెలిపింది. 30 కిలోల సైంటిఫిక్ ఎక్విప్మెంట్తో లూనా నింగికి ఎగరున్నది. చంద్రుడిపై అనేక పరీక్షలను ఆ మిషన్ ద్వారా చేపట్టనున్నారు. లూనా - 25 చంద్రుడి దక్షిణ ద్రువంలో ఉన్న బొగుస్లవిస్కీ క్రేటర్ వద్ద ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాస్కాస్మస్ వెల్లడించింది. చంద్రునిపై ప్రయోగాలు ఒక్క రష్యానే కాదు.. ఇతర దేశాలు అంతరిక్షంలోకి తమ వ్యోమగాముల్ని పంపిస్తున్నాయి. భారత్ ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా కూడా లూనార్ ప్రయోగాలు చేపట్టింది. ఇక అమెరికా 2025లో చంద్రుడిపై తన వ్యోమగాములను దింపేందుకు ప్రయత్నిస్తోంది.