Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : భారత్లో జరగనున్న జి 20 విదేశాంగ మంత్రుల సమావేశానికి తమ విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ హాజరవుతారని చైనా మంగళవారం ప్రకటించింది. భారత అధ్యక్షతన జి20 విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 1, 2 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న సంగతి తెలిసిందే. చైనా నుంచి ఇంతటి ఉన్నత స్థాయి అధికారి భారత్కు రావడం ఒక ఏడాది తరువాత ఇదే మొదటిసారి అవుతుంది. ఇటీవలే భారత్కు చెందిన అధికారుల బృందం మూడేండ్ల తరువాత చైనా పర్యటనలో పాల్గొన సంగతి తెలిసిందే. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆహ్వానం మేరకు జీ 20 సమావేశంలో క్విన్ పాల్గొంటారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడానికి దేశాలు ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని తెలిపింది.
సమావేశానికి జపాన్ దూరం?
భారత్లో జరిగే జీ20 విదేశాంగ మంత్రులు సమా వేశంలో జపాన్ పాల్గొనడంపై అనుమానం నెలకొంది. ఈ సమావేశాలకు జపాన్ నుంచి ఎవరు ప్రాతినిథ్యం వహిం చాలో ఇంకా నిర్ణయించలేదని మంగళవారం టోక్యోలో మీడియా సమావేశంలో ఆ దేశ విదేశాంగ మంత్రి యోషి మాసా హయాషి వెల్లడించడమే ఇందుకు కారణం. ప్రస్తు తం జపాన్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.