Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరసగా ఎనిమిదో ఏడాది కూడా సింగిల్ డిజెట్ పెరుగుదలే
బీజింగ్ : 2023లో చైనా వార్షిక రక్షణ బడ్జెట్ 7.2 శాతం పెరిగింది. దీంతో చైనా వార్షిక రక్షణ బడ్జెట్ వరసగా ఎనిమిదో ఏడాది కూడా సింగిల్ డిజెట్ పెరుగుదలే నమోదు చేసింది. ఆదివారం ముసాయిదా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.5537 ట్రిలియన్ యాన్లు (సుమారు 224.79 బిలియన్ల అమెరికా డాలర్లు). ఈ ముసాయిదా బడ్జెట్ను ప్రస్తుతం జరుగుతున్న చైనా జాతీయ లెజిస్లేటర్ సమావేశాల్లో ఆదివారం ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ పెరుగుదల 7.1 శాతంగా ఉంది. ఏది ఏమైనా...అమెరికా రక్షణ బడ్జెట్తో పోలిస్తే చైనా రక్షణ బడ్జెట్ నాలుగింట ఒక వంతు మాత్రమే. ఈ ఏడాది అమెరికా రక్షణ బడ్జెట్ దాదాపు 858 బిలియన్ల అమెరికా డాలర్లు అనే విషయం తెలిసిందే. తలసరిఆదాయం పరంగా చూస్తే అమెరికా చేస్తున్న రక్షణ వ్యయంలో పదహారవ వంతు మాత్రమే చైనా రక్షణ వ్యయం ఉంటుంది. చైనా రక్షణ బడ్జెట్ పెంపు 'సముచితమైనది, సహేతుకమైనది' అని 14వ నేషనల్ పీపుల్స్్ కాంగ్రెస్ మొదటి సెషన్ ప్రతినిధి వాంగ్ చావో తెలిపారు. సంక్లిష్టమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొవడానికి, చైనా తన ప్రధాన బాధ్యతలను నెరవేర్చడానికి ఈ పెంపు అవసరమని అన్నారు. రక్షణవ్యయాన్ని ఎంత పెంచినా.. సాయుధ బలగాలను ఎంత ఆధునీకరించినా.. చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని, విస్తరణను, తన ప్రభావాన్ని పెంచడాన్ని కోరుకోదని చెప్పారు. సుమారు 800 విదేశీ సైనిక స్థావరాలు, 159 దేశాల్లో 1,73,000 సైనికులను మోహరించిన అమెరికాకు విరుద్ధమైన విధానాన్ని చైనా అనుసరిస్తుందని చెప్పారు. చైనా రక్షణ వ్యయం బహిరంగంగా, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. ఐక్యరాజ్య సమితికి ప్రతీ ఏడాది చైనా తన సైనిక ఖర్చులపై నివేదికలను సమర్పిస్తోందని తెపారు. 'చైనా భవిష్యత్ మొత్తం ప్రపంచంతో ముడిపడి ఉంది. చైనా సైనిక ఆధునీకరణ ఏ దేశానికి ముప్పు కలిగించదు. ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శాంతిని రక్షించడానికి సానుకూల శక్తిగా మాత్రమే చైనా ఉంటుంది' అని వాంగ్ చెప్పారు.