Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జారీఅయిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటును బెలూచిస్తాన్ హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వ సంస్థలపై విద్వేష ప్రసంగం చేసినందుకు గానూ దాఖలైన కేసులో ఈ అరెస్టు వారంటు జారీ అయింది. కాగా ఈ చర్యను నిరసిస్తూ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. క్వెట్టాలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జారీచేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు ఉత్తర్వులను నిరసిస్తూ ఖాన్ పార్టీ బెలూచిస్తాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే ఖాన్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్ను కూడా రద్దు చేయాల్సిందిగా కోరింది. అరెస్టు వారంటును నిలుపుచేసిన బెలూచిస్తాన్ న్యాయమూర్తి జహీర్ ఉద్ దిన్ కాకర్ దీనిపై రెండు వారాల పాటు విచారణను వాయిదా వేశారు. దర్యాప్తు డైరెక్టర్ బెలూచిస్తాన్ ఇనస్పెక్టర్ జనరల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీనియర్ ఎస్పి (లీగల్), ఫిర్యాదీదారునికి నోటీసులు జారీ చేశారు.