Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని దివాళా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్విబి)ని ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్డిఐసి) స్వాధీనంలో ఉన్న ఎస్విబి డిపాజిట్లు, రుణాలను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ ఆధీనంలోకి వచ్చాయి. దీంతో సోమవారం నుంచి ఎస్విబి ఖాతాదారులందరూ ఇకపై ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ ఖాతాదారులుగా మారనున్నారు. 2023 మార్చి 10 నాటికి ఎస్‌విబికి 167 బిలియన్ డాలర్ల ఆస్తులు, 119 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. ఫస్ట్ సిటిజన్ బ్యాంక్‌కు ప్రస్తుతం 109 బిలియన్ డాలర్ల ఆస్తులు, 89.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజా కొనుగోలు నేపథ్యంలో ద్రవ్య లభ్యత సమస్య తలెత్తకుండా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్‌కు ఎఫ్డిఐసి రుణ మద్దతును అందించనుంది.