Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహౌర్ : వలసవాద కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని లాహౌర్ కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగానికి అనుగుణంగా లేదని పేర్కొంది. దాంతో పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని 12 4 ఎ సెక్షన్ చెల్లకుండా పోయింది. భారత్లో మాదిరిగానే పాకిస్తాన్లో కూడా ఈ చట్ట మూలాలు వలసవాద కాలం నాటివి. అందువల్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమాత్రం అసమ్మతి వున్నా వెంటనే వారిని శిక్షించాలని కోరుతుంది. ఈ చట్టాన్ని పాక్లో నిర్లక్ష్యంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అసమ్మతిని అణచివేయడానికి దీన్నొక సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆ పిటిషన్లు పేర్కొన్నాయి. పాకిస్తానీ రాజ్యాంగంలో 19వ అధికరణ కింద హామీ కల్పించబడిన భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా అణచివేస్తున్నారని పిటిషన్లు పేర్కొన్నాయి.
జస్టిస్ షాహిద్ కరీమ్ ఈ పిటిషన్లన్నింటినీ విచారించి తీర్పు ఇచ్చారని డాన్ పత్రిక పేర్కొంది. దేశ రాజ్యాంగం కింద సంక్రమించిన అనేక ప్రాధమిక హక్కులను ఈ చట్టం అవమానిస్తోదని హరూమ్ ఫరూక్ అనే వ్యక్తి తన పిటిషన్లో పేర్కొన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఈ దేశద్రోహ చట్టం కింద అనేకమంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, కార్యకర్తలు అరెస్టయ్యారు.