Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెర్బియన్ అధ్యక్షులు, అలెగ్జాండర్ ఉసిక్
సెర్బియా: 'అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ వాతావరణం, అణ్వాయుధ ప్రయోగ ప్రమాదం అంచున ప్రపంచం ఉంది. అగ్రరాజ్యాలు ప్రత్యక్షంగా తలపడే అవకాశమున్న వాతావరణంలో సెర్బియా చితికిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది' అని సెర్బియన్ అధ్యక్షులు అలెగ్జాండర్ ఉసిక్ అన్నారు. ఒకవైపు యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూనే రష్యాపైన ఆంక్షలను విధించటాన్ని వ్యతిరేకించే విధానాన్ని ఆయన సమర్థించారు.
''మనం రాజకీయ, సైనిక సంబంధిత విషయాలలో అత్యంత కష్టకాలంలో ఉన్నాము. మన పౌరుల సంక్షేమాన్ని పట్టించుకుంటూ, శాంతిని సంరక్షించుకుంటూ, మన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి కోసం పెట్టుబడులను పెంచుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి'' అని సెర్బియా అధ్యక్షుడు తన క్రల్టివో నగర పర్యటనలో పేర్కొన్నారు.
సెర్బియా చిన్న దేశమైనప్పటికీ దాని స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. చైనాతో సెర్బియాకు పెరుగుతున్న వాణిజ్యాన్ని కొన్ని దేశాలు ఆక్షేపించటం గరÛ్హనీయం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సెర్బియా తటస్థంగా ఉంది. రష్యాపైన ఆంక్షలను విధించే దేశాలలో సెర్బియాను చేర్చటానికి యురోపియన్ యూనియన్ చేస్తున్న ప్రయత్నాన్ని సెర్బియా ఆమోదించలేదు.