Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ''తీవ్ర హెచ్చరిక'' ఆపరేషన్ పేరుతో తైవాన్ ద్వీపాన్ని చుట్టుముట్టి చైనా సైనిక విన్యాసాలను నిర్వహించింది. తైవాన్ అధ్యక్షురాలు, సై ఇంగ్ వెన్ అమెరికా పర్యటనను ముగించుకుని రాగానే 71 చైనా యుద్ధ విమానాలు, తొమ్మిది యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి పరిధిని దాటాయి. తైవాన్ను చైనా తన భూభాగంగా పేర్కొంటున్నది. చైనా, తైవాన్ల విలీనం అనివార్యంగా జరగాలని చైనా అధ్యక్షులు జిన్ పింగ్ ప్రకటించారు. తైవాన్ అధ్యక్షులు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థి తో సమావేశం అయినందుకు ప్రతిగా చైనా తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది.