Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెచెన్ నాయకులు రమజాన్ కడీరోవ్
చెచెన్ : రష్యాపై అమెరికా, నాటో దేశాల అండతో ఉక్రెయిన్ చేయనున్న వసంతకాల సైనిక దాడి రష్యాకు అనుకూలంగా మారుతుందని చెచెన్ రిపబ్లిక్ అధ్యక్షులు రమజాన్ కడీరోవ్ అన్నాడు. రష్యాపైన దాడిచేసి తన చేజారిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ చేసిన పథక రచనకు చెందిన సమాచారం శుక్రవారం బహిర్గతమైన నేపథ్యంలో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి పర్యవసానాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఆ చర్చలో భాగంగానే చెచెన్ రిపబ్లిక్ అధ్యక్షుడు రమజాన్ కడీరోవ్ స్పందించాడు.రానున్న రోజుల్లో రష్యాపైన దాడిచేసి గెలవాలనే ఉక్రెయిన్ ఊహ హాస్యాస్పదంగా ఉందని ఆయన తన టెలిగ్రాం పోస్టులో పేర్కొన్నారు. 'వ్యక్తిగతంగా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఒక ప్రతిదాడి విజయవంతం అవ్వాలంటే పెద్ద ఎత్తున వనరులు అవసరం. అటువంటి సైనిక చర్య పర్యవసానంగా ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువ. అదేసమయంలో రష్యా రక్షిత స్థానాల నుంచి ఉక్రెయిన్ దాడిని ఎదుర్కునే వీలు ఉంటుంది' అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ జిత్తులను పసిగట్టి తన ఎత్తుగడలకు పదునుపెట్టే నేర్పు రష్యాకు ఉందని నొక్కిచెప్పారు. రక్షత స్థానాల నుండి ఉక్రెయిన్ దాడిని ఎదుర్కోవటానికి అవసరమైన వనరుల పరిమాణం కూడా తక్కువగా ఉంటుందని ఆయన తన టెలిగ్రాం సందేశంలో రాశాడు. ఇదిలా ఉండగా ఏప్రిల్-మే నెలల్లో ఉక్రెయిన్ రష్యా మీద ప్రతిదాడి చేయబోతు న్నదని అమెరికా విదేశాంగ కార్యదర్శి, ఆంటోనీ బ్లింకెన్ సూచనప్రాయం గా చెప్పారు. అది ఏకకాలంలో అనేక వైపులనుంచి మొదలవుతుందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి అలెక్సీ రెజ్నికోవ్ ప్రకటించారు. రాబోయే ఏడు నెలల్లో ఉక్రెయిన్ క్రైమియాను కైవసం చేసుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు మైకేల్ పొడోలియాక్ ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇది అంత తేలికైన వ్యవహారం కాదని అమెరికా సాయిధ దళాల జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ చైర్మన్ మార్క్ మిల్లే అన్నారు. అయితే రష్యా సైన్యం ఉక్రెయిన్, నాటో దేశాలతోపాటు అమెరికా సైనిక దళాల కదలికలను నిరంతరం పసిగడుతూనే ఉన్నదని రష్యా అధికార ప్రతినిధి, డిమిట్రీ పెస్కోవ్ ప్రకటించారు.