Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అధికార పర్యటన
- 20 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు?
బ్రసీలియా, బీజింగ్ : బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా బుధవారం నుండి నాలుగు రోజుల పాటు చైనాలో అధికార పర్యటన జరుపుతున్నారు. లూలా పర్యటనతో అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆర్థిక వ్యవస్థలు కలిగిన చైనా, బ్రెజిల్‌లు రాజకీయ, ఆర్థిక సంబంధాలతో పాటూ మొత్తంగా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకాన్ని ఆవిష్కరిస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా ప్రపంచ దేశాల్లోకి సానుకూల ప్రేరణ, ఉత్సాహాన్ని నింపుతాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. చైనావిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, వందలాదిమంది వాణిజ్య ప్రముఖులు, రాష్ట్రాల గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు, మంత్రులతో కూడిన అతి పెద్ద ప్రతినిధి బృందంతో లూలా చైనాలో పర్యటిస్తున్నారని, ఈ పర్యటనకు ఉభయ పక్షాలు అథిక ప్రాముఖ్యతను ఇస్తున్నాయని చెప్పారు. బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా చైనాలో పర్యటించడం ఇది మూడోసారి.