Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు నరసింహారావు
న్యూయర్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన 2011లో జరిగిన టెర్రరిస్టు దాడితో సంబంధం ఉన్నవాళ్ళను విచారించే గ్వాంటనమో మిలిటరీ కమిషన్(కోర్టు) ఊహాతీతమైన విషయాన్ని నిర్థారించింది. నేరారోపణకు గురైన వారి లాయర్ల అభ్యర్థన మేరకు కమిషన్‌కు చెందిన ప్రధాన ఇన్వెస్టిగేటర్ డాన్ కానెస్త్రారో విషయాన్ని లోతుగా పరిశీలించి 9/11 దాడి వెనుక సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రమేయం ఉండే అవకాశం ఉన్నట్టు తేల్చాడు. ఆ దాడిలో పాల్గొన్న ఇద్దరు హైజాకర్స్ అమెరికాకు రాకముందే సీఐఏ తన ఏజంట్లుగా నియమించుకుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరగటానికి ముందు 18 నెలల్లో నవాఫ్ అల్ హజమీ, ఖాలిద్ అల్ మిహధర్ల కార్యకలాపాలు తెలుసుకోలేనంత నిగూఢంగా ఉన్నాయి. వీళ్ళు అల్‌ఖైదా టెర్రరిస్టులయ్యే అవకాశం ఉందని సీఐఏ, ఎన్ఎస్ఏ లు పదేపదే రాసినప్పటికీ వీరిద్దరు 2000 జనవరిలో మల్టీ ఎంట్రీ వీసాపైన అమెరికా ను సందర్శించారు. వీళ్ళు అమెరికాకు రావటానికి కేవలం కొన్ని రోజుల ముందే మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అల్‌ఖైదా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలోనే 9/11దాడి గురించి వీళ్ళు చర్చించి ఉండవచ్చు. ఒసామా బిన్ లాడెన్‌ను వేటాడటానికి ఉద్దేశింపబడిన సీఐఏకు చెందిన అలెక్ స్టేషన్ అభ్యర్థన మేరకు ఆ సమావేశాన్ని మలేషియా అధికారులు రహస్యంగా వీడియో తీయటం జరిగింది. ఆశ్చర్యకరంగా ఈ వీడియోలో ఆడియో రికార్డ్ కాలేదు. అయినప్పటికీ హజ్మీ, మిధార్లను అమెరికా రాకుండా చేయటా నికి ఈ సమాచారం సరిపోతుంది. కనీసం ఎఫ్‌బీఐ కి వీళ్ళు అమెరికాలో ఉన్నారని చెప్పొచ్చు. ఎటు వంటి ఇబ్బందీ లేకుండా వీళ్ళను ఆరు నెలల పాటు లాస్ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో అనుమతించారు. ఈ సమాచారాన్ని తమపై అధికా రులకు అందించే వీలులేకుండా అలెక్స్ స్టేషన్‌ను బ్లాక్ చేశారు. సీఐఏ కావాలనే ఎఫ్‌బీఐ కి అటు వంటి పరిధిలేదని వీళ్ళకు సంబంధించిన సమాచారాన్ని బ్యూరోకి చేరనివ్వలేదు.
హజ్మీ, మిధార్లు అమెరికాలో దిగగానే క్యాలిఫోర్నియాలో నివసిస్తున్న సౌదీ జాతీయుడైన ఒమర్ అల్ బయూమీ ఒక ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ లో తారసపడ్డాడు. తరువాత రెండు వారాలు శాన్ డియాగోలో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకోవటంలో వారికి సహా నివాసిగా అగ్రిమెంట్ మీద సంతకం చేయటమే కాకుండా అద్దె కోసం 1500డాలర్లు ఇచ్చాడు. అన్వర్ అల్ ఆలకీ అనే స్థానిక మసీదు ఇమామ్‌కు వీళ్ళను పరిచయం చేశాడు. (ఈ ఇమా మ్ 2011లో యెమెన్‌లో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు). ఎఫ్‌బీఐ వేరే నిర్ధారణలకు వచ్చింది. బయూ మి సౌదీ గూఢచారి అని, అమెరికాలో వహాబీ నెట్వర్క్ ఎన్కోర్లో భాగమనీ, ఈ నెట్వర్క్ అమె రికాలో టెర్రరిస్టులు గా మారే అవకాశం ఉన్నవాళ్ళ ను గుర్తించేది, టెర్ర రిస్టుల, సౌదీ వ్యతిరేక విమర్శ కుల కార్యకలాపా లను పర్య వేక్షించేది. ఈ ఎన్కోర్ నెట్వర్క్ కి, సౌదీ ప్రభుత్వా నికి 9/11 దాడి గురించి ముందుగా తెలిసే అవకాశం 50/50 ఉంది.
అమెరికా ప్రభుత్వం కొన్ని ఎఫ్‌బీఐ డాక్యు మెంట్లను బహిర్గతం చెయ్యాలని నిర్ణయించిన 2022 మార్చిదాకా ఈ విధ్వంసకర వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలియదు. గ్వాటెనమో మిలిటరీ కమిషన్ తాజాగా విడుదల చేసిన ఫైలింగ్ వల్ల హజ్మీ, మిధార్ లను బయూమీ కలవ టం గురించి, వీళ్ళు అమెరికాలో ఉన్నంతకాలం వీళ్ళను సీఐఏ పర్యవేక్షించిన తీరు, 2001 ఆగస్టు దాకా వీళ్ళను గురించి ఎఫ్‌బీఐకి చెప్పటానికి నిరాకరించటంపైన మరింత అవగా హన వచ్చింది. వీటన్నింటిపై ప్రధాన ఇన్వెష్టిగేటర్ డాన్ కానెస్త్రారో లోతుగా శోధించి తేల్చినదేమంటే అల్ ఖాయిదాలో సీఐఏ జొరబాటును దాయటాని కి అది అధికార విచారణలను అడ్డకుందని బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. బయూమీని ఎఫ్‌బీఐ విచారించటాన్ని సీఐఏ అబద్దాలతోను, సహకరించ కుండా ఉండటంతోను అడ్డుకుందని సీఎస్-23 అనే ఎఫ్‌బీఐ ఏజంట్ సాక్ష్యం చెప్పాడు.
బయూమీపై సీఐఏ దగ్గరవున్న సమాచా రాన్ని ఎఫ్‌బీఐకి ఇవ్వకుండా తన దగ్గర అటువంటి సమాచారమే లేదని సిఐఏ బుకాయించింది. సౌదీ గూఢచార వర్గాలతో తనకున్న సంబంధాలతో సిఐఏ హజ్మీ, మిధార్లను తన ఏజంట్లుగా నియ మించుకునే ప్రయత్నం చేసింది. అలా సౌదీని మధ్యవర్తిగా ఉంచి వీళ్ళను గూఢచర్యానికి ఉపయో గించటంతో సీఐఏ అమెరికా చట్టాలను ఉల్లంఘిం చినట్టు కాలేదు. సీఐఏ ప్రోత్సాహంతోనే బయూమీ ఈ హైజాకర్స్కు బ్యాంకు ఎకౌంట్లు తెరిపించాడనీ, శాన్ డియాగోలో ఒక అపార్ట్మెంట్ అద్దెకు ఇప్పించా డని సిఎస్-3 అనే ఎఫ్‌బీఐ అధికారి చెప్పాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన 9/11 దాడిపైన అమెరికా సెనేట్, కాంగ్రేస్ జాయింట్ ఇంక్వైరీ ముందు అల్ ఖాయిదా కార్యకలాపాలతో సౌదీ ప్రభుత్వానికి ప్రమేయం ఉన్నదని చెప్పొద్దని ఎఫ్ బి ఐ ప్రతినిధులను ఆదేశించారు. 9/11 దాడిని ముందుగా నిలువరించే అవకాశం దొరకటానికి అవసరమైన సమాచారాన్ని సీఐఏ ఎఫ్‌బీఐకి ఇవ్వకుండా ఎందుకు దాచిందనే విషయం గురించి ప్రధాన ఇన్వెష్టిగేటర్ డాన్ కానెస్త్రారో ఎటువంటి నిర్దారణలకు రాకపోవటం ఆశ్చర్యం. అలాగే 9/11 దాడిపైన జరిగిన విచారణలో ఎఫ్‌బీఐ సీఐఏ కి సహకరించటం కూడా ఆశ్చర్యం కలిగించేదే. అల్ ఖాయిదాలో జొరబడి దాని టెర్రరిస్టు కార్యకలాపాల ను నిరోధించే పనిలో ఉండకుండా తన లక్ష్యాలను టెర్రరిస్టుల దాడికి గురయ్యేలా చేసే పనిలో సీఐఏ ఉండటంవల్లనే 9/11 దాడి జరిగిందని ఎవరికైనా అర్థం అవుతుంది.