Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు, కాల్పులు
- భారతీయులు ఇండ్లల్లోనే ఉండండి: భారతీయ ఎంబసీ
ఖార్టూమ్:పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్టూమ్ శనివారం దద్దరి ల్లింది. సాధారణ ఆర్మీ, పారా మిలటరీ బలగాలు ఒకరి స్థావరాలపై మరొ కరు దాడులు చేసుకుంటున్నాయి. దేశం చాలా ప్రమాదకరమైన మలుపులో వుందంటూ సైన్యం హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ దాడులు చోటు చేసు కున్నాయి. అధ్యక్ష భవనం, ఖార్టూమ్ విమానాశ్రయం తమ అధీనంలో వున్నా రయని పారామిలటరీ బలగాలు చెప్పాయి. సైన్యం ఆ వార్తలను ఖండిం చింది. దేశం పూర్తిగా కుప్పకూలకుండా వుండాలంటే ముందుగా కాల్పుల విరమణ జరగాలని పౌరనేతలు పిలుపునిచ్చారు. మిలటరీ నేత అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్‌కు, నెంబర్ టూ స్థానంలో వున్న పారా మిలటరీ బలగాల కమాండర్ హమ్దాన్ డాగ్లోకు మధ్య వివాదాలు ముదరడంతో ఈ హింస చోటు చేసుకుంది. పారా మిలటరీ అయిన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)ను రెగ్యులర్ ఆర్మీలోకి విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ఈ ఉద్రిక్తతలు చెలరేగాయి. దక్షిణ ఖార్టూమ్‌లోని ఆర్ఎస్ఎఫ్ స్థావరానికి సమీపంలో ఘర్షణలు, పెద్ద పెద్ద పేలుళ్లు, తుపాకుల కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇళ్లలోనే ఉండండి : భారతీయ ఎంబసీ
దేశంలో ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో భారతీయులందరూ బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే వుండాల్సిందిగా సూడాన్‌లోని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో కోరింది. అత్యంత జాగ్రత్తలు తీసుకుని, అందరూ సురక్షితంగా వుండాలని కోరుతున్నామంటూ ఎంబసీ పేర్కొంది. ఖార్టూమ్ విమానాశ్రయంలో భారతీయులు చిక్కుకుపోయారని వార్తలు వస్తున్నా, ఇంతవరకు ఎవరూ ధ్రువీకరించలేదు.