Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామ్రాజ్యవాద దేశాల మధ్య ముదిరిన విబేధాలు!
ఫ్రాన్స్ :ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్ ఇటీవల చేసిన చైనా పర్యటనతో చైనా, రష్యాలపైన అమెరికా, దాని మిత్రదేశాలు ఏ లక్ష్యం తో దాడులు చేస్తున్నాయనేది స్పష్టమైంది. ఆర్థిక సంక్షోభం, అస్థిర ఫైనాన్షి యల్ మార్కెట్లు, వర్గ పోరాటాల పెరుగుదలతో సతమతమౌతున్న సా మ్రాజ్యవాద దేశాలు వినాశకర మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాదం అంచున మానవాళి భవితను నిలిపి బలవంతంగా ప్రపంచాన్ని మళ్ళీ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రష్యాని వశపరుచుకుని, ఆ దేశానికున్న విస్తృత మైన సహజ వనరులను దోచు కోవాలనేది, చైనా అప్రతిహత ఆర్థికాభివృద్ధిని నిలు వరించాలనేది అమెరికా కూటమి తక్షణ లక్ష్యంగా ఉంది. అయితే ఈ ఘర్షణ తీవ్రతరమౌతు న్న కొద్దీ అమెరికా, ఐరోపాల మధ్య, ఐరోపాలోని ప్రత్యర్థి దేశాల మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి.
ఈ మధ్య కాలంలో అమెరికా, చైనాను నిత్యం రెచ్చగొడుతూ ఉంది. 50 సంవత్సరాలపాటు అనుసరించిన ''ఒకేఒక చైనా'' విధానాన్ని అమెరికా పక్కనబెట్టింది. చైనా సముద్ర తీరంలో అమెరికా మిలిటరీ తరచూ సైనిక విన్యాసాలను నిర్వహిస్తూ వుంది. గతవారంలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఫిలిఫ్పైన్స్తో జమిలిగా సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఇటు వంటి ఉద్రిక్త వాతావరణంలో మక్రాన్ ఒక పెద్ద డెలిగేషన్‌తో చైనాను సందర్శిం చాడు. చైనా చేసిన సకల సత్కారాలందుకున్న మాక్రాన్ ఆ దేశంతో అనేక లాభసాటి ఆర్థిక ఒప్పం దాలను కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేస్తున్న కృషిని శ్లాఘించాడు. తన తిరుగు ప్రయాణంలో అనేక మంది ఐరోపా రాజకీయ నాయకుల మనసులో వున్నా బయటకు చెప్పని విషయాన్ని మక్రాన్ వ్యక్తపరి చాడు. ''పొలిటికో'' జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను అమెరికా అవలంబి స్తున్న ''చైనా విధానం''తో తీవ్రంగా విబేధిస్తున్నానని మక్రాన్ ప్రకటించాడు. ఐరోపా గందరగోళంలో
పడి గుడ్డిగా అమెరికా విధానాన్ని అనుస రించకుండా నిజమైన ''వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి''ని అభివృద్ధి చేసుకోవాలని, కూటమి తర్కంలో ఇరుక్కుని మనవికాని సంక్షోభాలలో కూరుకుపోకూడదని ఆయన అన్నాడు. ఐరోపా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని, ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలని, అమెరికాపైన ఆధారపడకుండా ఐరోపా రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని, అందు కోసం ''ఐరోపా యుద్ధ ఆర్థికవ్యవస్థ'' ఆవశ్యకత ఉం టుందని మక్రాన్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ప్రపంచంపై అమెరికా డాలర్ ఆధిపత్యం అంతం అవ్వాలని కూడా ఆయన పరోక్షంగా చెప్పాడు.
మక్రాన్ మాట్లాడింది ఫ్రెంచ్ సామ్రాజ్యవాద ప్రతినిధిగానే తప్ప శాంతి దూతగా కానేకాదు. చాలాకాలం ఇతను చైనా పట్ల కఠినంగా వ్యవ హరించాలనే దృక్పథాన్ని కలిగివుండేవాడు. వలసలు ఉండటంవల్ల ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ రాజ్యంగా చలామణీ అవుతూ ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో కలిసి చైనా వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే అమెరికా మక్రాన్ను పక్కనబెట్టింది. 2021లో బ్రిటన్, ఆస్ట్రేలియాలతో కలిసి అమెరికా ''ఆకస్'' కూటమిని ఏర్పాటు చేసినప్పుడు ఆస్ట్రేలియా 56 బిలియన్ డాలర్ల విలువైన ఫ్రెంచ్ జలాంతర్గాముల కొనుగోలును రద్దు చేసింది. దీనితో మక్రాన్ అమెరికా, ఆస్ట్రే లియా రాయబారులను ఉప సంహరించి నిరసన తెలిపాడు. అంతకు ముందే 2017లో తన సోర్బోన్ విశ్వవిద్యాలయం ప్రసంగంలో ప్రస్తావించిన ''వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి''ని గురించి ప్రచారాన్ని ముమ్మరం చేశాడు.
చైనా విధానంపై మక్రాన్ చేసిన వ్యాఖ్యలు అమెరికా, ఐరోపాలలో పెద్ద దుమారాన్నే లేపాయి. చైనాను నిలువరించాలనే అమెరికా ప్రయత్నా లకు ఫ్రెంచ్ అధ్యక్షుడు అడ్డుపడుతున్నాడని నూయార్క్ టైమ్స్ ఆరోపిం చింది. ఐరోపా రష్యాకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి నిధులను నిలిపి వేసి వైదొలుగుతామని వాల్ స్ట్రీట్ జర్నల్ ఫ్రాన్స్‌ను బెదిరించింది. యూరోపియన్ యూనియన్, జర్మనీ కూడా తీవ్ర నిరసన తెలియజేశాయి. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ లేయెన్ కూడా మాక్రాన్‌తో చైనా పర్యటించింది. తమ పర్యటనకు ముందు చెప్పినదానికి మక్రాన్ చైనాలో చేసిన దానికి ఏమాత్రం పొంతనలేదని యూరోపియన్ కమిషన్ విమర్శించింది.
ఐరోపాలో ప్రాబల్య రాజ్య విధానం జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య పాత తగవులను తిరగతోడుతుంది. ఈ రెండు దేశాలు ప్రత్యర్థులుగా మూడు ప్రధాన యుద్ధాలలో భీకరంగా పోరాడాయి. అమెరికా కనుసన్నల్లో ఈ రెండు దేశాల భాగస్వామ్యం, రెండవ ప్రపంచ యుద్ధానంతర ఐరోపా ఐక్యత వర్దిల్లింది. అమెరికా భౌగోళిక రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల ఐరోపాను శాంతపరుస్తోంది. ఒకవేళ ఐరోపా స్వతంత్రంగా ప్రపంచ స్థాయి ప్రాబల్య ప్రాంతంగా వృద్ధి చెందాలని జర్మనీ, ఫ్రాన్స్‌లు భావిం చినా దానికి ఎవరు నాయకత్వం వహించా లనే సమస్య అపరిష్క్రుతంగానే ఉంటుంది.
ఉక్రెయిన్‌లో అమెరికా కూటమి ప్రమేయంతో జరుగుతున్న యుద్ధం రోజు రోజుకూ తీవ్రతర మౌతోంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా యుద్ధాని కి కాలుదువ్వుతోంది. జర్మనీ, ఫ్రాన్స్‌ల ప్రాబల్య రాజ్య కాంక్షతో పెట్టుబడిదారీ యుద్ధ ప్రమాదం ఎల్లవేళలా పొంచివుంటుందన్న వాస్తవం కళ్ళెదుటే ఉంది. సామాజిక అసమానతలను, పర్యావరణ విధ్యంసాన్ని పెంచిపోషించే పెట్టుబడిదారీ వ్యవస్థ లో నెలకొన్న పరిష్కరింపజాలని సంక్షోభం సామ్రా జ్యవాద దేశాలను 1914, 1939లో జరిగినట్టుగా మరో వినాశకర ప్రపంచ యుద్ధానికి సన్నద్ధం చేస్తోంది.