Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు నరసింహారావు
చైనా స్థూల జాతీయోత్పత్తిపై ఈ వారంలో ప్రచురింపబడిన సమాచారం ప్రకారం చైనా ఆర్థిక వ్యవస్థ 2023 మొదటి త్రైమాసికంలో అందరి అంచనాలను అధిగమించి 4.5శాతం వృద్ధిని సాధించింది. రిటైల్ అమ్మకాల్లో 7.4 శాతం వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేస్తే అది 10.6శాతానికి పెరిగింది. చైనాను మూడు సంవత్సరాలపాటు కోవిడ్ కుంగదీసిన తరువాత సాధించిన ప్రగతి ఇది. ఈ వార్తను చూసిన తరువాత ఆర్థికవేత్తలు, బ్యాంకులు, సంస్థలు వర్తమాన సంవత్సరానికి మరింత ఆశాజనకమైన అంచనాలను చైనా సాధి స్తుందని భావిస్తున్నారు. కోవిడ్‌ని నియంత్రించటా నికి చైనా తీసుకున్న తీవ్ర చర్యలవల్ల కలిగిన దుష్పలితాల నుంచి తేరుకుని చైనా 6శాతాన్ని మించి వృద్ధిని సాధించే అవకాశముంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య చైనా ఆర్థిక వ్యవస్థ అన్ని అంచనాలనూ మించి ముందుకు దూసుకుపోతోంది. చైనా అద్భుతమైన వృద్ధికి, దాని ఉత్తానానికి, దాని భోగభాగ్యాలకు కాలం చెల్లిందని గత రెండు సంవత్సరాలుగా రాసిన వ్యాసాలు ఒక వెల్లువలా మీడియాను ముంచెత్తాయి. అమెరికన్ ఎంటర్ప్రైస్ ఇన్స్టిట్యూట్ అనే నయామితవాద థింక్ టాంక్ ''ముగిసిన చైనా అద్భుత ఆర్థిక ప్రగతి'' అనే వ్యాసాన్ని 2022 నవంబర్‌లో ప్రచురించింది. ఇలాంటి విషాధ అంచనాల పట్టిక చాలా పొడవుగా ఉంది.
అంతకు ఒక సంవత్సరం ముందు ప్రముఖ ఫోర్బెస్ మాగజైన్ ''ముగుస్తున్న చైనా అద్భుత ఆర్థిక ప్రగతి'' అనే పతాక శీర్షికతో ఇలానే అంచనావేసింది. ''వేగవంతమైన చైనా వృద్ధికి కాలం చెల్లనుంది'' అని అల్ జజీరా కూడా రాసింది. ఇటువంటి అంచనాలు, శీర్షికలతో లోవీ ఇన్స్టిట్యూట్, ఫారిన్ అఫైర్స్ మ్యాగ జైన్ వంటి అనేక ప్రచురణ సంస్థలు వ్యాసాలను ప్రచురించాయి. కేవలం ఒక నెల క్రితం న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక వ్యాసానికి ఈ శీర్షిక పెట్టింది: ''చైనా ప్రగతి పశ్చిమ దేశాలతో సంబంధా లపైన ఆధారపడింది. ఈ సంబంధాలను జిన్‌పింగ్ బలహీన పరుస్తున్నాడు''. కోవిడ్ నియంత్రణకు చైనా అవలంభించిన జీరో కోవిడ్ విధానం చైనా వృద్ధికి, అభివృద్ధికి చావుగంట గా మారుతుందని, తత్ఫలితం గా చైనా అమెరికాను ఎన్నడూ అధిగమించజాలదని పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు వెల్లువై నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నాయి. చైనా జనాభాలో వయసు మీరు తున్న వారి శాతంలో పెరుగుదల, శిశు జననాల రేటు పడిపోవటంవంటి కారణాలచేత ఆ దేశానికి అంతర్జాతీయంగా పోటీపడే శక్తి బలహీన పడుతుందని, అందువల్ల దీర్ఘకాలంలో వృద్ధి కుంటు పడుతుందని సాగే వాదనలు ఈ వ్యాసాలలో కనపడ తాయి. అయితే ఈ వ్యాఖ్యాతలు పట్టించుకోని విషయం ఏమంటే తన ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేసుకోగలిగిన సామర్థ్యం పశ్చిమ దేశాలకంటే చైనాకే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఎంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజక్టునైనా అతి తక్కువ సమయంలో పూర్తిచేయగల సామర్థ్యం చైనా స్వంతం. వృద్ధి సాధించటానికి ఉపయోగపడే పరిశ్రమలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను సమకూర్చి ప్రోత్సహించ గలగటం చైనా వ్యవస్థకున్న ప్రత్యేకత. వీటన్నింటికీ అనుబంధంగా అపారమైన చైనీస్ అంతర్గత మార్కెట్ విపరీతమైన వేగంతో విస్తుృతమౌతోంది.
చైనా ప్రగతి అంతం అవుతుందని ఇలా అనేక సంస్థలు, ప్రచురణలు వేసిన అంచనాలు, పుంకాను పుంకంగా రాసిన రాతలు ఎందుకు ఇలా తలకిందు లవుతున్నాయి? ఈ సంవత్సరం ఉంటేగింటే 1శాతం కూడా వృద్ధి రేటులేని అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ఇవే సంస్థలు పరిస్థితి ఆశాజనకంగా ఉందంటూ ఎందుకు ఊదరగొడుతుంటాయి? చైనా గురించి రాసేటప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకో కుండా భావజాలపరమైన, తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా చైనా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు పతనంవైపు పరుగులు తీస్తున్నాయంటూ అమెరికా, దాని కూటమి దేశాల మీడియా మహాకథనాలను వండివారుస్తుంటాయి.
నేటి ప్రపంచంలో చైనా అప్రతిహత ఆర్థిక ప్రగతి కొందరికి మరింత భయాందోళనలు కలిగించే విషయంగా మారింది. ఎందుకంటే అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా దేశాలు ప్రవచిస్తున్న భావ జాలం చైనా నమూనా, సోషలిస్టు భావజాలం ముందు వీగిపోతున్నదన్న భావన ఈ దేశాలలో ఉన్నది. మానవాళి దశను, దిశను నిర్ణయించే సంస్కృతి పశ్చిమ దేశాల సొత్తు అని, మిగిలిన ఆలోచనా స్రవంతులన్నీ తప్పుడుతడకలనే భావన అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలకు ఉంది. మానవ చరిత్ర పరస్పర వ్యతిరేక శక్తుల ఘర్షణలతో నిరంతరం ముందుకు సాగుతూనే వుంటుందనే హెగెల్ గతి తర్కానికి, మార్క్స్ గతితార్కిక భౌతికవాదానికి ప్రతిగా ఫ్రాన్సిస్ ఫుకుయామా ''చరిత్ర ముగిసింది'' అనే వ్యాసాన్ని 1989లో ప్రచురించాడు. చారిత్రిక పరిణామ క్రమంలో అంతిమంగా లిబరల్ ప్రజాస్వామ్యం విజేతగా నిలిచిందని, అదే అన్ని దేశాలకు ప్రభుత్వ రూపంగా ఉంటుందని ఫుకుయామా సూత్రీకరించాడు. అయితే వైరుధ్యభరితమూ, నిత్య సంక్షుభితమూ అయిన పెట్టుబడిదారీ వ్యవస్థ పునాధిగావున్న లిబరల్ ప్రజాస్వామ్యం సార్వజనీనమైన అంతిమ రాజకీయ వ్యవస్థగా మనజాలదని మనకు చరిత్ర నిరంతరం గుర్తుచేస్తూనే ఉంది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో రష్యా డాలర్ నిధులను కైవసం చేసుకుని, ఆ దేశంపైన పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ప్రపంచ దేశాలను మేల్కొలిపాయి. అమెరికా తనకు నచ్చని ఏ దేశంపైనైనా ఇటువంటి చర్యలు చేపట్టే వీలుంటుంది గనుక డాలర్లలో నిధులను ఉంచుకో వటం తమ ఆర్థిక భద్రతకు విఘాతమని వివిధ దేశాలు భావిస్తున్నాయి. తత్ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్యంలో అనేక దేశాలు స్థానిక కరెన్సీలను పరస్పరం ఆమోదిం చుకుంటున్నాయి. రష్యాలాంటి కొన్ని దేశాలు చైనీస్ యువాన్‌లో కూడా తమ వాణిజ్యాన్ని కొనసాగి స్తున్నాయి. ఆవిధంగా ఏర్పడిన బహుళ ధృవ ప్రపంచం దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొంది స్తోంది. చైనాకు రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వామి అయింది. రష్యా సహజ వనరులు, చైనా పారిశ్రామిక ఉత్పత్తులు పరస్పరం లాభసాటిగా మారాయి. చైనా, రష్యా భాగస్వామ్యం ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాలను అధిగమిం చటానికి, ఆర్థికంగా, సాంకేతికంగా ఎదగటానికి సానుకూల అవకాశాలను అందిస్తుంది. ఈ రెండు దేశాల భాగ స్వామ్యం ఇప్పటికే పశ్చిమ దేశాలకు సవా లుగా మా రింది. రష్యా సహజ వనరులు లేకపోతే పశ్చిమ దేశా లలో సరుకుల ఉత్పత్తి వ్యయం పెరిగి అంతర్జాతీయ వాణిజ్యంలో చైనాతో పోటీకి నిలువ లేవు. తమ ప్రయోజనాలను పట్టించుకోకుండా అమెరికా ప్రయో జనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నందుకు పశ్చి మ దేశాలు చెల్లిస్తున్న మూల్యం ఇది.ఒక ప్రత్యా మ్నాయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థగా చైనా తన లోపా లను సవరించుకుంటూ మరింత సమన్వయంతో అసమానతలను అధిగమిస్తూ మరింతగా ముందుకు సాగిపోయే దిశలో చైనా పయని స్తోంది.