Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాశ్చాత్య 'నిష్ణాతుల' తప్పుడు లెక్కలు!
నెల్లూరు నరసింహారావు
తమకు ఇష్టంలేని వాస్తవాలను దాచటం ఇక సాధ్యం కాదని తేలిన తరువాతే పాశ్చాత్య మీడియా అనేక వంకరటింకర వివరణలతో వాటిని ప్రచురిస్తుంది. ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక చేసిన నిర్ధారణ ఏమంటే అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ జీ-7 (అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఇటలీ) దేశాల ఆర్థిక వ్యవస్థలు కుచించుకుని పోతుండగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) దేశాల ఆర్థిక వ్యవస్థలు ముందుకు సాగుతున్నాయి.
గతంలో ఈ వాస్తవాన్ని గుర్తించటానికి పాశ్చాత్య మీడియా నిరాకరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటాను జీ-7 దేశాల వాటాతో పోల్చటానికి 2032వ సంవత్సరందాకా పడుతుందని 2007లో పాశ్చాత్య నిష్ణాతులు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఇలా మరోసారి పాశ్చాత్య ఆర్థిక అంచనాలు విఫలమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా జీ-7 దేశాల వాటా స్థాయికి 2020లోనే చేరింది. ఎన్ని రకాల ఎత్తులకు, జిత్తులకు పాల్పడినప్పటికీ తాజా అంచనాల ప్రకారం 2028కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ-7 దేశాల వాటా 27.8శాతంవుండే అవకాశం ఉండగా బ్రిక్స్ దేశాల వాటా కనీసం 35 నుంచి 40 శాతానికి చేరుకుంటుంది.
రష్యా ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన దాని ప్రభావం గురించి ఇటువంటి అరకొర అంచనాలనే పాశ్చాత్య విశ్లేషకులు చేశారు. ఈ విశ్లేషణలు ప్రపంచ నిగూఢ రాజ్య(గ్లోబల్ డీప్ స్టేట్) ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంటాయి. ముందుగా రష్యా ఆర్థిక వ్యవస్థను, ఆ తరువాత ఆ దేశ సామాజిక సమగ్రతను నాశనం చేయటానికి గత సంవత్సరానికిపైగా రష్యాపైన పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు చరిత్రలో మరే దేశంపైనా విధించబడలేదు. ఇటువంటి అంచనా వెనుక వాస్తవాల కంటే సమిష్టి పాశ్చాత్య దేశాల ఆర్థిక సత్తా ముందు రష్యా ఎంత? అనే దురహంకారం ఉంది.
ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తరువాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల పరంపరను అధిగ మించటానికి రష్యా అనేక ప్రతిచర్యలను తీసుకుంది. నిజానికి యుద్ధానికి ముందే రష్యా ద్రవ్య వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చింది. అలా చేసివుండకపోతే వీసా, మాస్టర్ కార్డులు రష్యా నుంచి వైదొలిగినప్పుడు ఆ ప్రభావం రష్యాపై తీవ్రంగా ఉండేదే. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికే ''మీర్ ఇండిపెండెంట్ నేషనల్ పేమెంట్ సిస్టమ్''ని 2015లోనే రష్యా కేంద్ర బ్యాంకు, ఫైనాన్స్ మినిస్ట్రీ రూపొందించాయి. దీనితో విదేశీ చెల్లింపుల వ్యవస్థ నిష్క్రమించినప్పటికీ అది రష్యాపై అంతగా ప్రభావాన్ని చూపలేదు. అలాగే రూబుల్‌ని రక్షించేందుకు రష్యా తీసుకున్న చర్యలు విజయవంతం కావటం కూడా రష్యాకు కలిసివచ్చింది. 2022 మార్చిలో డాలర్‌తో మారకంలో రూబుల్ విలువ 121.5కు పడిపోయింది. రష్యా నుంచి ఎగుమతి అయ్యే చమురుకు చెల్లింపులు రూబుల్లో జరగాలని రష్యా పట్టుబట్టటంతో రూబుల్ మీద వత్తిడి తగ్గింది. ఈలోపు చమురు, గ్యాస్ ధరలు పెరగటంతోను, దిగుమతులు తగ్గటంతోను రష్యా మార్కెట్లు విదేశీ మారకపు ద్రవ్యంతో నిండిపోయాయి. ప్రస్తుతం డాలర్ 81 రూబుల్స్‌గా ఉంది. వీటికి తోడుగా దేశీయ పరిశ్రమను రక్షించటానికి తీసుకున్న చర్యలు రష్యా ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాయి.
ప్రపంచంలోనే అత్యంత సువిశాల దేశమైన రష్యా ఆర్థిక వ్యవస్థ ఇటలీ ఆర్థిక వ్యవస్థను మించి ఉండదని పాశ్చాత్య దేశాల నిష్ణాతులు సూత్రీకరిస్తుంటారు. ఈ సూత్రీకరణ చేసేటప్పుడు కరెన్సీలలో తేడాలను, అప్పుల కుప్పగావుండే సేవారంగాన్ని అతిగా విలువ కట్టటం వంటి విషయాలను పరగణనలోకి తీసుకోవటం జరగలేదు. అయినప్పటికీ ఇటువంటి అంచనాలలో ఎక్కడో ఏదో తేడా కొట్టింది. వీరి అంచనాలకు అనుగుణంగా రష్యా సాగిలపడలేదు సరికదా కనీసం తొణకలేదు. గ్లోబల్ ఎనర్జీ సూపర్ పవర్ గానే కాకుండా తాజాగా గ్లోబల్ ఫుడ్ సూపర్ పవర్‌గా కూడా రష్యా స్థాయి మరోసారి ఖాయం అయింది. రష్యా పతనం గురించి కన్న కలలు నిజం కాకపోవటానికి తమ లెక్కల్లో తప్పులు దొర్లటమే కారణమని పాశ్చాత్య నిష్ణాతులు గ్రహించారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనంచేసి, ఆ దేశాన్ని పాదా క్రాంతం చేసుకోవాలనే పాశ్చాత్య ఆలోచన ఎందుకు విఫలమైందో చూద్దాం. రష్యా, ఇటలీ ఆర్థిక వ్యవస్థలను పోల్చటంలోనే పాశ్చాత్య నిష్ణాతుల ఘోరమైన అసమర్థత దాగివున్నదని నేషనల్ ఇంటరెస్ట్ అనే అమెరికన్ మ్యాగజైన్లో ప్రచురింప బడిన ఒక వ్యాసంలో రచయితలు పేర్కొన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే పోలిక మూలాలు ఆర్థిక వ్యవస్థలను నామినల్ జీడీపీతో పోల్చే పద్ధతిలో ఉన్నాయి. ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయ్యే సరుకులు, సేవల మొత్తం విలువను నామినల్ జీడీపీ అంటారు. 2013లో ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం రష్యా నామి నల్ జీడీపీ 2.29 ట్రిల్లియన్ డాలర్లు, ఇటలీ నామినల్ జీడీపీ 2.14 ట్రల్లియన్ డాలర్లు. ఈ గణన పద్ధతిలో మౌలికంగా లోపాలు న్నాయి. గ్లోబల్ బ్రాండ్లు, కాపీ రైట్స్ వంటి 'పేపర్ ఆస్తుల'కు భిన్నంగా జీవన ప్రమాణాలకు సర్దు బాటు చేసిన మారకపు విలువ, కొను గోలు శక్తి సమానత(పర్చేజింగ్ పవర్ ప్యారిటీ, పీపీపీ), శ్రామిక ఉత్పాదకత, తలసరి సంపద, అన్నింటికంటే ముఖ్యంగా అందుబాటు లోవున్న భౌతిక వనరులు, వస్తువులను పరిగణనలోకి తీసుకోకుండా వేసిన లెక్కలవి.
ఈ ఒక్క లోపాన్ని సరిదిద్ది రష్యా వాస్తవ జీడీ పీని గణిస్తే అది నాలుగవ అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన జర్మన్ జీడీపీకి దగ్గరగా ఉంది: ఈ గణన ప్రకారం 2021లో రష్యా జీడీపీ 4.81 ట్రిల్లియన్ల డాలర్లుగా ఉంటే జర్మనీ జీడీపీ 4.85 ట్రిల్లియన్ల డాలర్లుగా ఉంది. కానీ ఇటువంటి మెరుగుపర్చబడిన గణాంకాలు కూడా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిం చవు. సంక్షోభ సమయంలో భౌతిక వస్తువుల ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయంలో రష్యా ఆర్థిక వ్యవస్థ జర్మన్ ఆర్థిక వ్యవస్థకంటే పెద్దది. ఇది ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు రెండు రెట్లు ఉంటుంది. ఇదేకాకుండా ప్రపంచ ఇందన అవసరాలను తీర్చటంలోను, ముఖ్య మైన సహజ వనరులను, ఆహార పదార్థాలను సరఫరా చెయ్యటంలోను రష్యా ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ప్రపంచ భద్రతపై వీటి ప్రభావాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.