Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : జపాన్లో ఆదివారం ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...జపాన్ రాజధాని టోక్యో నుంచి బయలుదేరిన ఓ ప్రయివేట్ హెలిక్యాప్టర్ టోక్యోకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమొరో ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని కొనవూపిరితో ఉన్న మరో వ్యక్తిని హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.