Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: సూపర్సోనిక్ న్యూక్లియర్ డెలివర్ వెహికిల్‌ని విజయవంతంగా చైనా ప్రయోగించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణశాఖ ధృవీకరించింది. దక్షిణ చైనా సముద్రాంతర్భాగంలోని దీవుల్లో సైనికావసరాల నిమిత్తం చైనా తాత్కాలిక నిర్మాణాలు చేపడుతుండగా...ఆ నిర్మాణాల్ని అడ్డుకునేందుకు అమెరికా ఎప్పట్నుంచో విఫలయత్నం చేస్తోంది. ఈ విషయంలో చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా ఆసియా దేశాల మద్దతు కూడా కోరుతోంది.
అదే సమయంలో చైనా కూడా సత్తా చాటేందుకు తనవంతు కృషి చేస్తూనే ఉంది. ఈ నేపధ్యంలోనే సూపర్సోనిక్ డెలివర్ వెహికిల్‌ని చైనా విజయవంతంగా ప్రయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
18నెలల్లో నాలుగో ప్రయోగం
తాజాగా సూపర్సోనిక్ న్యూక్లియర్ డెలివర్ వెహికల్ ప్రయోగంతో గడిచిన 18 నెలల కాలంలో చైనా దేశం ఈ తరహా ప్రయోగాల్ని నాలుగుమార్లు నిర్వహించినట్లయింది. అయితే, తమ భూభాగంలో ఈ తరహా ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించడం సాధారణమేనని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని హాంకాంగ్‌లోని సౌత్‌చైనా మార్నింగ్‌పోస్ట్ పేర్కొంది.