Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వియాన్నా : ఇరాన్‌పై ఆంక్షల్ని ఎత్తివేసే అంశంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, అమెరికా దేశాలు కీలక చర్చలు జరుపుతు న్నాయని, కీలకమైన అంశాన్ని పరిష్కరటం కోసం ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయని పశ్చిమదేశాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి ఆంక్షల్ని తొలగించటం కోసం ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయి లావరోవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంక్షల్ని తొలగించే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒప్పందం కుదిరే అవకాశం త్వరలో వుందని, వియన్నాలో చర్చలకు తెరపడితే ఆంక్షల ఎత్తివేతకు మార్గం సుగమమవుతుందని లావరోవ్ అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై యూరప్, అమెరికా దేశాల ప్రతినిధులు గతకొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అణు ఒప్పందం ఎలా వుండాలన్న కీలక అంశాన్ని ఆయా దేశాలు నిర్ణయించబోతున్నాయి.