Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపవిదేశాంగ మంత్రి సెర్జీ ర్యాబ్కోవ్
ఉఫా: రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు విధించిన కొన్ని ఆంక్షలు నిరవధికంగా కొనసాగే అవకాశం వుందని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్జీ ర్యాబ్కోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రష్యన్ ఫెడరేషన్లో తిరిగి చేరిన క్రెమియా సార్వభౌమత్వ పరిస్థితిలో మార్పుచేసే ప్రసక్తే లేదని, అందువల్లే తమ దేశంపై విధించిన ఆంక్షల్లో కొన్ని నిరవధికంగా కొనసాగే అవకాశం వుందని అన్నారు. గత ఏడాది మార్చిలో క్రిమియాలో నిర్వహించిన సెవాస్తపోల్ (ప్లెబిసైట్) తరువాత రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆయన బ్రిక్స్ వాణిజ్య మండలి చర్చల్లో పాల్గొన్నారు.