Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : క్యూబాపై విధించిన వాణిజ్య, పర్యాటక ఆంక్షల్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ట్రంప్ సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 14, 2018 వరకూ ఈ వాణిజ్య, పర్యాటక ఆంక్షలు కొనసాగుతాయని శ్వేతసౌధం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. అమెరికా జాతీయ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో ట్రంప్ సర్కార్ తెలియజేసింది. ఈ నేపథ్యం లో అమెరికా కంపెనీలేవీ క్యూబా సంస్థలతో లావాదేవీలు జరపలేవు.