Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి అయిన హిల్లరీ క్లింటన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. హిల్లరీ తాను రాసిన 'వాట్ హ్యాపెన్డ్' అనే పుస్తకాన్ని మంగళవారం విడుదల చేశారు. ఇందులో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను వివరించారు. దీనిపై ట్రంప్ ట్విటర్లో స్పందిస్తూ.. హిల్లరీ క్లింటన్‌కి తన తప్పులు ఒప్పుకోకుండా ఇతరులపై నిందలు వేయడం మాత్రమే తెలుసని అన్నారు. ముఖాముఖి చర్చల్లో ఓడిపోవడం వల్లే గమ్యం తప్పిందని, ఎంత డబ్బు ఖర్చుచేసినా, ఆఖరికి ఆట గెలవలేకపోయిందని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ సమయంలో హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినా అమెరికన్ల తరఫున మాట్లాడుతూనే ఉంటానని తాను మాట్లాడే విషయాలను మీడియా సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు.