Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదు
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అక్లాండ్ ద్వీపం నుంచి 211కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సునామీ వచ్చే ప్రమాదం లేదన్నారు.