Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వియన్నా : ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించిన ఐఎస్‌ను తుదముట్టించేందుకు అమెరికా, రష్యా చేయిచేయి కలిపాయి. ఈమేరకు రష్యా, అమెరికా దేశాలు శనివారం ఓ అంగీకారానికి వచ్చాయి. సిరియాలోని ఐఎస్ ఉగ్రమూకపై సంయుక్తంగా పోరాటం చెయ్యాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ అంగీకారానికి వచ్చారని రష్యా ప్రకటించింది. వియత్నాంలోని దనంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకానామిక్ కోఆపరేషన్(ఏపీఈసీ) సమావేశంలో పాల్గొన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్, అమెరికా సెక్రటరీ ఆఫ్ రెక్స్‌టిల్లర్‌సన్ మధ్య చర్చల అనంతరం ఈ అంగీకారం జరిగిందని వెల్లడించింది. సిరియాలోని ఐఎస్‌ను అంతం చేసి పరిపాలన కోసం రాజకీయపరమైన చర్య తీసుకోవాలని ఇరుదేశాల అధ్యక్షలు నిర్ణయించారని ప్రకటించింది.
ఇదిలావుండగా ఈ ప్రకటనపై వైట్‌హౌస్ స్పందించలేదు. సిరియాలో ఇప్పటివరకూ అమెరికా, రష్యా వేరువేరుగా ఉగ్రవాదులను ఏరివేస్తున్న సంగతి తెలిసిందే.