Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రత్యేక రాయబారి ఈ నెల17 నుంచి ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్టు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హుÛవా వెల్లడించింది. జిన్పింగ్తో అమెరికా అధ్యక్షుడు సమావేశమైన కొద్ది రోజులకే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వరుస అణుపరీక్షలు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను చైనా తన పలుకుబడిని వినియోగించి దారికి తేవాలంటూ ట్రంప్ పలుమార్లు కోరారు. ఇటీవల ట్రంప్ ఆసియా పర్యటన సందర్భంగానూ చైనా అధ్యక్షుడితో దీనిపైనే చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే అణ్వాయుధాలు, మిస్సైల్ కార్యక్రమాలపై చర్చలు జరిపేందుకు... చైనా రాయబారి ఉత్తరకొరియా పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. ''అధికారిక కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ లియాసన్ విభాగం డైరెక్టర్ సోంగ్ తావో శుక్రవారం ప్యోంగ్యాంగ్ బయల్దేరి వెళ్లనున్నారు. గత నెలలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాలపై నివేదించనున్నారు...'' అని జిన్హుÛవా వెల్లడించింది. కాగా, 2015 అక్టోబర్ తర్వాత మంత్రి-స్థాయి చైనా ప్రతినిధి ఉత్తరకొరియాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.