Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్-1బీ వీసాలు మరింత కఠినం
వాషింగ్టన్: హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ సర్కార్ మరోసారి సిద్ధమైంది. ఈ వీసా జారీ నిబంధనలు కఠినతరం చేస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికా కాంగ్రెషనల్ కమిటి ఆమోదం తెలిపింది. ఈ కమిటి ప్రతిపాదన ప్రకారం...హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను 60,000 డాలర్ల నుంచి 90,000డాలర్లకు పెంచాల్సి ఉంటుంది. హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు కూడా పలు షరతులు విధించాలని కమిటి ప్రతిపాదించింది. అమెరికా కాంగ్రెషనల్ కమిటి ప్రతిపాదనలు అమెరికాలో పనిచేస్తున్న భారత ఐటీ ఉద్యోగుల పాలిట శాపంగా మారే ప్రమాదముంది. అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాలదారులను నియమించే విధానాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. దీంతో పాటు భారత్ నుంచి వస్తున్న ఐటీ నిపుణులకు పలు ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును పొందుపరిచింది. అయితే, ఇది చట్టంగా మారాలంటే తొలుత ప్రతినిధుల సభ, అనంతరం సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే దాన్ని చట్టరూపంలోకి తీసుకొస్తారు. భారత్ నుంచి వస్తున్న ఐటీ నిపుణులపై పలు ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును పొందుపరిచింది. ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్(హెచ్ 170) కింద ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ బిల్లు ద్వారా అమెరికన్ల ఉద్యోగులను భర్తీ చేయకుండా.. హెచ్-1బీ వీసాదారులను నియమించడాన్ని అడ్డుకుంటారు. అమెరికా ఉద్యోగులను రక్షిస్తూ.. కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు ఇది దోహదపడుతోందని ఇంటర్నెట్ సబ్‌కమిటి చైర్మెన్ డారెల్ ఇస్సా అభిప్రాయపడ్డారు. అమెరికా ఉద్యోగాల్లో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యం కల్పించాలని హౌస్ జ్యుడీషియరీ కమిటీ చైర్మెన్, కాంగ్రెస్‌మెన్ బాన్ గుడ్లాటే డిమాండ్ చేశారు.