Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనీయుడిపై యూఎస్ పౌరుడి దాడి
- శాన్ఫ్రాన్సిస్కో రైలులో ఘటన
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార ఘటన చోటుచేసుకున్నది. శాన్ఫ్రాన్సిస్కో నగరంలో రైలులో ప్రయాణిస్తున్న ఓ చైనా పర్యాటకుడిపై అమెరికా పౌరుడు భౌతికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘర్షణను ఆ రైలులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కోలో బయలుదేరిన బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ (బార్ట్) రైలులో ప్రయాణిస్తున్న చైనా ప్రయాణీకుడిని అమెరికా పౌరుడు దుర్భాషలాడాడు. ' ఆసియన్లంటే నాకు పరమ అసహ్యం. అందులో చైనీయులంటే ఎక్కువ' అంటూ చైనీయుడిపై దాడికి పాల్పడ్డాడు. రైలులో ప్రయాణిస్తున్న సహచర ప్రయాణికులంతా ఈ పెనుగులాటను అడ్డుకు నేందుకు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
సోషల్ మీడియాలోని పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న బార్ట్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పరారాలో ఉన్న నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేయనున్నట్టు తెలిపారు.