Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : బ్రిటన్‌లోని అత్యంత ప్రభావ వంతమైన మహిళా నేతల జాబితాలో నోబెల్ అవార్డు గ్రహీత, బాలల హక్కుల కోసం పోరాడుతున్న మలాలా యూసఫ్జారుకు చోటు దక్కింది. ఈ జాబితాను బ్రిటన్‌కు చెందిన హార్పర్ బజార్ మ్యాగజైన్ రూపొందించింది. మ్యాగజైన్ 150వ వార్షికోత్సవం సంద ర్భంగా పలువురు మహిళా ప్రతి భావం తుల జాబితాను తయారుచేసింది. 'ఒపినీయన్ ఫార్మర్స్' విభాగంలో లెబనాన్‌కు చెందిన బారిస్టర్ అమల్ క్లోనీ, హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్, హ్యారీపోటర్ రచయిత్రి జేకే రోలింగ్ సరసన మలాలా పేరు కూడా ఉంది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మలాలా పేరు 'బజార్స్ 150 విజనరీ విమెన్ లిస్ట్'లో ఉన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
బాలికల విద్య, వారి హక్కుల కోసం మలాలా చేస్తున్న కృషిని గుర్తించి ఆమెకు గతంలో నోబెల్ అవార్డు ఇచ్చారు. లెబనాన్‌లోని సిరియా శరణార్థుల చిన్నారుల కోసం మలాలా ఓ పాఠశాలను ప్రారంభించింది. ప్రస్తుతం మలాలా ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీపీఈ( పొలిటిక్స్, ఫిలాసఫీ, ఎకనామిక్స్) డిగ్రీని అభ్యసిస్తున్నారు.