Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్నే: దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలు.. స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్న నల్లధనం వివరాలను ఇక ఎప్పుకప్పుడు తెలుసుకోవచ్చు. స్విస్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు ఆటోమేటిక్గా ఇచ్చిపుచ్చుకునేందుకు స్విట్జర్లాండ్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. స్విట్జర్లాండ్ పార్లమెంటులోని ఎగువ సభకు చెందిన ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్తో పాటు మరికొన్ని దేశాలతో స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఇలాంటి ఒప్పందాలను ఆమోదించింది. అయితే వ్యక్తిగత లీగల్ క్లయిములకు భద్రతను పటిష్టపరచాలని కమిటీ సలహా ఇచ్చింది. ఈ సిఫారసులను ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆమోదించవలసి ఉంది. దీనికి ఆమోదం లభిస్తే స్విస్ బ్యాంకుల్లో డబ్బు పోగేసుకునే వారి వివరాలు భారత ప్రభుత్వం పొందగలుగుతుంది.