Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 328 అడుగుల వాయుశుద్ధీకరణ టవర్ ప్రారంభించిన చైనా
బీజింగ్ : పొగమంచు నుంచి పౌరుల రక్షణకు చైనా వినూత్న ప్రయోగం చేపట్టింది. 328 అడుగుల వాయుశుద్ధీకరణ టవర్‌ను ప్రయోగాత్మకంగా నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ అని నిపుణులు చెబుతున్నారు. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో గల జియాన్‌లో టవర్ నిర్మించారు. దేశంలో ప్రాణాంతకంగా మారిన పొగ మంచు సమస్యను ప్రభావవంతంగా ఎదుర్కోవడంలో ఇది సానుకూల ఫలితాలనిస్తోంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ ఎన్విరాన్మెంట్ పరిశోధకులు జియాన్ స్మాగ్ టవర్‌పై పరీక్షలు జరుపుతున్నారు. ఈ టవర్ ప్రారంభించిన నాటి నుంచి రోజకు 10 మిలియన్ క్యుబిక్ మీటర్లకు పైగా దూరానికి స్వచ్చమైన గాలిని అందిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన కావో జున్జి తెలిపారు.స్వచ్చమైన గాలిని 10 కిలోమీటర్ల దూరం వరకు అందించగల అంశంపై గడిచిన కొన్ని నెలల కాలంగా పరిశోధనలు జరిగిన తరువాత గాలి నాణ్యత మెరుగు పడిందని ఆయన చెప్పారు. ఈ టవర్ ప్రభావాన్ని తనిఖీ చేసేందుకు జియాన్‌లో పదికి పైగా కాలుష్య నియంత్రణ స్టేషన్లను ఏర్పాటు చేశారు.