Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా : తమ దేశంలో నివసిస్తున్న సూడాన్, ఎరిత్రియా దేశాలకు చెందిన 37వేల మందికి పైగా శరణార్థులను వెనక్కి పంపించాలని లేదా జైళ్ళలో బంధించాలని ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయాన్ని కెనడా తీవ్రంగా ఖండించింది. మార్చి 1వ తేదీ నుండి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది. సురక్షితమైన ఏదో ఒక ఆఫ్రికన్ దేశానికి వెళ్ళిపోవడానికి వారికి 60 రోజులు గడువు ఉందని పేర్కొంటూ ఇజ్రాయిల్ అధికారులు నోటీసులు అందజేశారు. అంతేగాకుండా, వారికి విమాన టిక్కెట్, కొంత సొమ్ము అందచేస్తామని తెలిపారు. అలా వెళ్ళని పక్షంలో నిరవధికంగా జైల్లో మగ్గాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలా మూకుమ్మడిగా ప్రజలను తరలించే విధానాలకు తాము మద్దతివ్వబోమని కెనడా పేర్కొంది.