Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: సింగపూర్‌కు చెందిన బ్రాడ్‌కామ్ అనే సంస్థ 117 బిలియన్ డాలర్లు విలువ చేసే అమెరికాకు చెందిన క్వాల్కామ్ అనే చిప్స్ సంస్థను టేకోవర్ చేసుకునే ఓ పెద్ద వ్యాపార లావాదేవీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళ వారం నిలిపి వేశారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఈ డీల్ నుంచి తప్పుకున్నామని ట్రంప్ తెలిపారు. ప్రతిపాదిత టేకోవర్‌ను తక్షణం శాశ్వతంగా రద్దు చేసుకోమని ఆదేశించారు. ఏ రూపంలోనై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మరే రూపంలోనైనా కొనుగోలు దారుడు క్వాల్‌కామ్‌ను తీసుకోవడాన్ని నిషేధిం చామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా అధ్య క్షుని ఉత్తర్వులను సమీక్షిస్తున్నామని బ్రాడ్‌కామ్ ఒక ప్రకటనలో పేర్కొంది.