Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ని వినూత్న రీతిలో అభినందించారు. ఇటీవలే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్‌కు చైనా ట్విట్టర్‌గా పేరుగాంచిన 'సినా విబో' ద్వారా చైనా భాషలో శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధాలు మరింత పటిష్టం చేయడానికి ఇరువురం కలిసి పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. జిన్‌పింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే పలు సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన పాలసీలను మార్చారు. చైనా పార్లమెంట్ జిన్‌పింగ్‌ను దేశ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.