Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి
ప్రేగ్ : చెక్ రిపబ్లిక్లోని యునీ పెట్రోల్ రసాయనిక కర్మాగా రంలో భారీ పేలుడు సంభవిం చింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రు లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. రీజినల్ ఫైర్ సర్వీస్ అధికార ప్రతినిధి వ్లాదిమీర కెరెకోవా తెలిపిన వివరాల ప్రకారం...యునీపెట్రోల్ కెమికల్ ప్లాంట్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే పనిలో నిమగమయ్యాయి. పేలుడు సంభవించిన యునీపెట్రోల్ కెమికల్ ప్లాంట్ జెక్ రిపబ్లిక్లో అతి పెద్దది. ఈ కర్మాగారంలో ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.