Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ రాజకీయ, ప్రభుత్వ పదవులను చేపట్టడంపై ఇస్లామాబాద్ హైకోర్టు జీవిత కాల అనర్హత వేటు వేసింది. పాకిస్తాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) నేత ఉస్మాన్ దార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. యూఏఈలోని ఓ కంపెనీకి ఖవాజా న్యాయ సలహాదారుగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారని పిటిషనర్ ఆరోపించారు. ఆయనకు 2017,జూన్29న తాజాగా లేబర్ కార్డు జారీ అయిందని పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు కూడా ఇకామా (కంపెనీ సలహాదారు పదవి) ఉండటం వల్లే ఆయన రాజకీయ పదవులు చేపట్టడంపై అనర్హత వేటు వేశారని, అదేవిధంగా ఖవాజాను కూడా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఈ ఆరోపణలపై ఖవాజా మాట్లాడుతూ తాను ఏ విషయాన్నీ దాచలేదన్నారు. తన నామినేషన్ పత్రాల్లో అబుదాబి ఇకామా గురించి తెలియజేశానని అన్నారు.