Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెవాడ : లాస్వేగస్ కాసినో కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చారు. డిమాండ్ల సాధన కోసం వచ్చేనెల 1 నుంచి సమ్మెకు దిగ నున్నట్టు పలు కార్మిక సంఘాలు బుధవారం ప్రకటించాయి. దాదా పు 50వేల మందికిపైగా కార్మి కులు ఈ సమ్మెలో పాల్గొంటారని వెల్లడించాయి. కాసినో హోటల్స్ లో పనిచేస్తున్న హౌస్కీపర్స్, క్లీనర్స్, పోర్టర్స్, బెల్మెన్, కుక్స్, కిచన్ వర్కర్స్, బార్టెండర్ల కాంట్రాక్టును పునరుద్ధరించడంలేదని లాస్వేగస్ యాజమాన్యం ప్రకటించింది. మే31 తో వారి కాంట్రాక్టు ముగిస్తుం దని పేర్కొంది. దీంతో, వేలాది మంది కార్మికులు నిరుద్యోగులుగా మారాల్సి వస్తుంది. కాంట్రాక్టును పునరుద్ధరిం చాలని కార్మిక సంఘాలు చేసిన అభ్యర్థనను లాస్వేగస్ యాజమాన్యం తిర స్కరించడంతో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగికవేధిం పులను అరి కట్టేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలనే డిమాండ్లను కార్మికులు తెరపైకి తీసుకొచ్చారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాసినో కార్మికులు సమ్మెలో పాల్గొనడం గమనార్హం. లాస్వేగస్ కాసినోలో పనిచేస్తున్న వర్కర్స్ 2002లో సమ్మెకు దిగారు. అయితే, యాజమాన్యా నికి, కార్మిక సంఘాలకు మధ్య సయోధ్య కుదరడంతో సమ్మెను విరమించు కున్నారు. కార్మికుల డిమాండ్లకు కాసినో యాజ మాన్యం అంగీకరిం చింది. 1984లోనూ కార్మి కులు మెరుపు సమ్మెకు దిగారు. నాటి సమ్మె 67రోజుల పాటు కొనసాగింది. దీంతో, యాజ మాన్యం మెట్టుదిగక తప్పలేదు. కార్మికుల సమ్మె వల్ల కాసినోకు లక్షల డాలర్లలో నష్టం వాటిల్లింది.