Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ (యూఎన్హెచ్ఆర్సీ) నుంచి వైదొలిగినట్టు అమెరికా ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈ మేరకు ప్రకటించారు. కాగా, మానవ హక్కుల పరిరక్షణ నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు కౌన్సిల్ చీఫ్ జెద్ బిన్ రాద్ అల్ హుస్సేన్ తెలిపారు. అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ పట్ల వివక్ష చూపడంతోపాటు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వారిని ఉపేక్షించడాన్ని నిరసిస్తూ తామీ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా పేర్కొనడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. పారిస్ పర్యావరణ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన సంగతి తెలిసిందే. తాజాగా ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నుంచి వైదొలగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ సర్కార్ అమెరికా-మెక్సికో సరిహద్దులో అక్రమ వలసదారుల వద్ద నుంచి వారి పిల్లలను వేరు చేస్తుడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికా డిమాండ్ చేసిన సంస్కరణలు చేపట్టడం లేదు : నిక్కీ
అమెరికా డిమాండ్ చేసిన పలు సంస్కరణలను మండలి పట్టించుకోవడం లేదని నిక్కీ విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము మండలిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నా మని అన్నారు. మానవ హక్కులను ఉల్లంఘి స్తున్న వారంతా పదవుల్లో కొనసాగుతున్నారని, వారే కౌన్సిల్‌కు ఎన్నికవుతున్నారు అని హేలీ విమర్శించారు. ప్రపంచంలో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వారు యథేచ్ఛగా పాలిస్తున్నారు. మానవ హక్కులను కాపాడుతున్న దేశాలను బలి పశువులను చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ వివక్షకు ఎన్నో ఏండ్లుగా మానవ హక్కుల మండలి వేదికైందని, ఉల్లంఘిస్తున్న వారినే అందలమెక్కిస్తున్నారని నిక్కీ విమర్శిం చారు. కాగా, స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరం లోని ఐరాస మానవ హక్కుల మండలిలో మొత్తం 47 దేశాలు ఉన్నాయి. మానవ హక్కు లను ఉల్లంఘిస్తున్న వారికి వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసు కున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. అయితే, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఐరాస అసంతృప్తి వ్యక్తంచేసింది. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌ను 2006లో ఏర్పాటు చేశారు. 47 సభ్య దేశాలున్న ఈ కౌన్సిల్ లో సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న మొదటి దేశం అమెరికానే అని ఐరాస అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సిల్ ఏడాదికి మూడు సార్లు సమావేశమై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘ నలపై చర్చిస్తోంది.
యూఎన్హెచ్ఆర్సీలోని కీలకాంశాలు...
- దీనిని ఐరాస... మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు.
- ఇందులో 47 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. సభ్యత్వం గడువు మూడేండ్ల పాటు ఉంటుంది.
- ప్రపంచమంతటా మానవ హక్కుల సమస్యలపై నిఘా ఉంచడం ఈ కౌన్సిల్ లక్ష్యం.
- ఒబామా పదవిలో ఉన్న సమయంలో అమెరికా తొలిసారి 2009లో ఈ కౌన్సిల్లో సభ్యురాలిగా చేరింది.