Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూకు సెంట్రల్ ఐరోపా దేశాల సూచన
వియన్నా: ఐరోపా దేశాలు తమ సరిహద్దులను పరిరక్షించుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని వైస్గ్రాడ్ (పోలండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా) దేశాలతో పాటు ఆస్ట్రియా ఐరోపా కూటమికి సూచించాయి. ఐరోపా దేశాలు తమ సరిహద్దులను పరిరక్షించుకునే సామర్ధ్యాన్ని సమకూర్చుకుని, తమ పౌరులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని వైస్గ్రాడ్ దేశాలు, ఆస్ట్రియా భావిస్తున్నాయని హంగరీ ప్రధాని విక్తర్ ఓర్బన్ చెప్పారు. వియన్నాలో ఆస్ట్రియా ఛాన్స్లర్ సెబాస్టి యన్ కుర్జ్తో భేటీ అయిన అనంతరం వైస్గ్రాడ్ దేశాల ప్రధానులు శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐరోపా కూటమి దేశాల మధ్య సంబంధాలను సహకారంతో బలపర్చుకోవాలి తప్ప సంఘర్షణలతో బలహీన పర్చుకోరాదని స్పష్టం చేశారు.