Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్4న ప్రమాణం
- మాలి ఎన్నికల్లో మరోసారి గెలుపొందిన సీటా
బమాకో : మాలీ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఇబ్రహీమ్ బౌబర్ కీటా (73) ఘన విజయం సాధించారు. తద్వార ఆయన మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మాలీ ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం...అధ్యక్ష ఎన్నికలో కీటా ఘన విజయం సాధించారు.
ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత సౌమైలా సీస్ ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కీటాకు 67శాతం ఓట్లు నమోదు కాగా, సౌమైలాకు 32శాతం ఓట్లు నమోదయ్యాయి. మరో ఐదేండ్ల పాటు అధ్యక్ష పదవిలో సీటా కొనసాగనున్నారు. సెప్టెంబర్4న అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారు. 2015లో మాలీ, మిత్రదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం..ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించ నున్నట్టు కీటా తెలిపారు.