Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: జపాన్ పాలక లిబరల్ డెమొక్రాటిక్ పార్టీలో జరిగిన నాయకత్వ పోటీలో ప్రస్తుత ప్రధాని షింజో అబే ఘన విజయం సాధించారు. ఆయన తనతో పోటీ పడిన మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబాను ఓడించి తన నాయకత్వ స్థానాన్ని పదిల పర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తానన్న హామీతో 2012లో జపాన్ సారధ్య బాధ్యతలను స్వీకరించిన అబే తన ప్రత్యర్థిపై భారీ తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో పోలయిన 810 ఓట్లలో 807 మాత్రమే చెల్లుబాటయ్యాయి. అందులో అబేకు 553 ఓట్లు లభించగా, ఆయనతో పోటీ పడిన ఇషిబాకు 254 ఓట్లు మాత్రమే లభించాయి. 2019 మొత్తం ఆయన పదవిలో కొనసాగితే జపాన్‌కు అత్యధిక కాలం సారధ్య బాధ్యతలు నిర్వహించిన ప్రధానిగా రికార్డులకెక్కుతారు. గతంలో 20వ శతాబ్ది ఆరంభంలో అప్పటి ప్రధాని టారో కట్సురా జపాన్ ప్రధానిగా 2,886 రోజులు బాధ్యతలు నిర్వహించి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.