Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా యాంటీ ట్రంప్ హోటల్ ప్రారంభమైంది. 2016లో ట్రంప్ ఎన్నిక తర్వాత ఆ దేశంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులే ఈ హోటల్ స్థాపనకు ప్రధాన కారణం. ట్రంప్‌కు చెందిన ఓ ఫైవ్ స్టార్ హోటల్ పక్కనే దీన్ని నిర్మించడం గమనార్హం. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఈ 'ఈటన్ వర్క్‌షాప్'ను యాంటీ ట్రంప్ హోటల్‌గా పిలుస్తున్నారు. 209 గదులున్న ఈ వర్క్‌షాప్‌లో.. హోటల్, హౌస్, మీడియా, వెల్నెస్, ఇంపాక్ట్ విభాగాలు ఉన్నాయి. దీని విశిష్టత ఏంటంటే ఆతిథ్యానికి సామాజిక మార్పును జోడించిన ఈటన్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'యాక్టివిస్ట్ హోటల్' అన్నమాట. ప్రపంచాన్ని ముందుకు నడిపించాలనుకునే వారికి చోటిచ్చే ఈటన్లో.. హోటల్ బెడ్ సైడ్ టేబుళ్లపై బైబిల్‌కు బదులుగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనలు కనిపిస్తాయి. 'జెండర్'తో సంబంధం లేకుండా ఎవరైనా వాడుకునేందుకు వీలుగా ఉంటాయి ఇక్కడి బాత్రూమ్లు. ఇక్కడ వాడే ప్రతీ వస్తువు పర్యావరణ హితమైనదే. 'వైల్డ్ డేస్'గా పిలిచే రూఫ్‌టాప్ బార్లో.. మాంసాన్ని తలపించే శాకాహార వంటకాలే లభ్యమవుతాయి. 'ఈటన్' రాజకీయాలేమిటో ఇలాంటి చిన్నచిన్న విషయాలు చెబుతాయి. ఇక్కడ మేధోమథనంలో మునిగితేలొచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసే ఏ అంశంపై అయినా చర్చించవచ్చు. ఇదొక విభిన్న ఆలోచనల సంగమ స్థలం. ప్రగతిశీల భావాల కేంద్రం. ఇక్కడి రాడికల్ లైబ్రరీలో ప్రగతిశీల, రాజకీయ సాహిత్యం లభ్యమవుతుంది. కళలు, సంగీత ధోరణులు, తత్వశాస్త్ర సంబంధిత గ్రంథాలు ఉంటాయి. కళాత్మకత ఉట్టిపడే సినిమా రూమ్ ఇక్కడొక ప్రత్యేకత. వెల్నెస్ సెంటర్లో సాంత్వన చేకూర్చే యోగా, ధ్యానం, రెకీ (జపనీస్ టెక్నిక్) వంటి వాటిని సాధన చేయొచ్చు. పరిశోధ నాత్మక జర్నలిస్టుల కోసం ఇదొక రెసిడెన్సీ స్కీమ్‌కు శ్రీకారం చుట్టనుంది. ఉద్యమ కారులకు, ప్రచారకులకు ఉచితంగా మీటింగ్ హాల్ సమకూర్చుతుంది.
తండ్రి బాటలో తనయ....
ఈటెన్ స్థాపకురాలు కాథెరిన్ లో. ఆమె హాంకాంగ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ బిలియనీర్ కా షురు కుమార్తె. యేల్ వర్సిటీలో కళలు, మానవ శాస్త్రంపై పీజీ అభ్య సించారు. పర్యావరణపై కూడా అధ్యయనం చేశారు. గ్రీన్ కారప్స్ పర్యావరణ బృందంతో కలసి పనిచేశారు. యుద్ధ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారు. ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సు చేసి సామాజిక అంశాలపై డాక్యుమెంటరీలు కూడా తీశారు. మార్పునకు దారు లు వేయగల బ్రాండ్‌ని సృష్టించాలనేది తండ్రి ఆమెకు ఇచ్చిన సలహా. ఈ నేపథ్యం లోనే 36 ఏండ్ల కాథెరిన్కు ఇలాంటి విలక్షణ హోటల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందట. ఈ హోటల్లో ఒక రాత్రి గడపాలంటే కనిష్టంగా 199 డాలర్లు చెల్లించుకోవాలి.